Parvathi Melton: తల్లికాబోతున్న ‘జల్సా’ బ్యూటీ.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్
వెన్నెల సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ బ్యూటీ పార్వతి మెల్టన్(Parvathi Melton). కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది.

Heroine Parvathy Melton shares baby bump photos on social media
Parvathi Melton: వెన్నెల సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అమెరికన్ బ్యూటీ పార్వతి మెల్టన్. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ, మంచి బ్రేక్ మాత్రం లభించలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఆ తరువాత కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. (Parvathi Melton)దాంతో మహేష్ బాబు దూకుడు , బాలకృష్ణ శ్రీమన్నారాయణ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. ఆ తరువాత సినిమాలకు దూరమయ్యింది.
తిరిగి అమెరికా వెళ్లిన పార్వతి 2012లో అక్కడే ఓ బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకుని సెటిల్ అయ్యింది. అయితే, పెళ్ళై పదమూడు ఏళ్ళైనా తరువాత తల్లికాబోతున్నట్టుగా ప్రకటించింది ఈ బ్యూటీ. దానికి సంబంధించి బేబీ బంప్ ఫొటోస్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో, పార్వతి ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.