Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ సినిమా.. నాగార్జున సినిమా కథేనా? లేదా తమిళ్ సినిమా కథా?

సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉండనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటంతో సెంటిమెంట్ తో పాటు రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

Hi Nanna : నాని ‘హాయ్ నాన్న’ సినిమా.. నాగార్జున సినిమా కథేనా? లేదా తమిళ్ సినిమా కథా?

Hi Nanna Movie story have similarities Nagarjuna Santosham Movies

Hi Nanna Movie : న్యాచురల్ స్టార్ నాని (Nani) ‘దసరా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన 30వ సినిమాగా ‘హాయ్ నాన్న’తో రాబోతున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) నటిస్తుండగా శృతిహాసన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది అని సమాచారం. ఇక ఈ సినిమా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఉండనున్నట్టు చిత్రయూనిట్ తెలిపింది. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో నాని, మృణాల్ మధ్య రొమాంటిక్ సీన్స్ ఉండటంతో సెంటిమెంట్ తో పాటు రొమాన్స్ కూడా బాగానే ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే హాయ్ నాన్న సినిమా కథ నాగార్జున సంతోషం సినిమా కథ నుంచి తీసుకున్నారు అని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. సంతోషం సినిమాలో నాగార్జున, గ్రేసీ సింగ్ ప్రేమించుకొని లేచిపోయి వెళ్లి పెళ్లి చేసుకొని బాబుని కంటారు. ఆ తర్వాత గ్రేసీ సింగ్ క్యారెక్టర్ చనిపోయాక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ శ్రియ నాగార్జునని చూసి ఇష్టపడి వాళ్లకు దగ్గరవుతుంది. నాగార్జున బాబుకి కూడా దగ్గరయి చివరికి శ్రియ నాగార్జునని పెళ్లి చేసుకుంటుంది.

అయితే ఇప్పటివరకు హాయ్ నాన్న నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ చూస్తే సంతోషం సినిమా కథే గుర్తుకు వస్తుంది. నాని తన కూతురుతో కలిస్ ఉంటాడు. వీళ్ళ జీవితంలోకి మృణాల్ వస్తుంది. వీళ్లిద్దరికీ బాగా దగ్గరవుతుంది, నానినే మృణాల్ కి ప్రపోజ్ చేస్తాడు. చివరికి వీరిద్దరూ కలిసిపోతారు. అయితే ఇందులో శృతి హాసన్ క్యారెక్టర్ గెస్ట్ అప్పీరెన్స్ ఉండటంతో నాని భార్యగా, చనిపోయే క్యారెక్టర్ లో చూపిస్తారేమో అని భావిస్తున్నారు. కథ ఒకటే తీసుకున్న కథనం మాత్రం వేరు ఉండొచ్చు అని తెలుస్తుంది.

Also Read : Mehreen Pirzada : వెబ్ సిరీస్‌లో బోల్డ్‌గా నటించినందుకు విమర్శలు.. సోషల్ మీడియాలో ఫైర్ అయిన మెహ్రీన్..

అలాగే తమిళ్ లో ఇటీవల దాదా అనే సినిమా వచ్చింది. ఆ సినిమా పోస్టర్స్ లాగే హాయ్ నాన్న పోస్టర్స్ కూడా ఉండటంతో కొంతమంది ఆ సినిమా కథ, హాయ్ నాన్న కథ ఒకటే అవ్వొచ్చు అంటున్నారు. అయితే ఇటీవల హాయ్ నాన్న ప్రమోషన్స్ లో ఇది ఒరిజినల్ స్క్రిప్ట్ అని, ఎక్కడ్నుంచి కాపీకొట్టలేదని చిత్రయూనిట్ తెలిపారు. మరి సినిమా రిలీజయ్యేదాకా ఎదురుచూడాల్సిందే ఇది కొత్త కథా లేక నాగార్జున సంతోషం కథా అని. హాయ్ నాన్న సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.