AP Cinema Tickets Issue : జీవో 35పై విచారణ వాయిదా.. వాళ్లకి ఏపీ హైకోర్టు నోటీసులు

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్‌ నర్సింహారావు ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలు చేశారు...

AP Cinema Tickets Issue : జీవో 35పై విచారణ వాయిదా.. వాళ్లకి ఏపీ హైకోర్టు నోటీసులు

Ap High Court

Updated On : January 20, 2022 / 7:19 AM IST

AP Cinema Tickets Issue :   ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల్ని తగ్గిస్తూ కొన్ని రోజుల క్రితం జీవో 35ని పాస్ చేసింది. ఈ నిర్ణయంపై చాలా మంది సినీ ప్రముఖులు, థియేటర్ యాజమాన్యాలు , ఎగ్జిబిటర్లు వ్యతిరేకించారు. దీనిపై ఇప్పటికి సినీ పరిశ్రమ వ్యక్తులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ని కలిసి సినీ సమస్యలతో పాటు సినిమా టికెట్ రేట్లు పెంచాలనే అంశంపై చర్చించారు.

AP Online Cinema Tickets : ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్మితే తప్పేంటి?.. ఏపీ ప్రభుత్వంతో ఏకీభవించిన హైకోర్టు

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ జారీ చేసిన జీవో 35ను సవాలు చేస్తూ సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం అధ్యక్షుడు జీఎల్‌ నర్సింహారావు ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ అధినేత దగ్గుబాటి సురేశ్‌బాబుకు నోటీసులు జారీ చేసింది. తర్వాతి విచారణను వాయిదా వేసింది.