Hrithik Roshan : చేతికర్రల సాయంతో స్టార్ హీరో.. వీల్ చైర్‌లో కూర్చోవాలి అంటూ పోస్ట్.. నిరాశలో ఎన్టీఆర్ అభిమానులు..
హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకి బెల్ట్, చేతికర్రల సాయంతో నిల్చొని ఉన్న ఫోటోని షేర్ చేసాడు.

Hrithik Roshan shares his photo it shows Injured to his Legs and waist Fans Disappointed
Hrithik Roshan : బాలీవుడ్(Bollywood) స్టార్ హీరో హృతిక్ రోషన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫైటర్ అనే సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. నెక్స్ట్ వార్ 2 సినిమాతో రాబోతున్నాడు. హృతిక్ రోషన్ – ఎన్టీఆర్(NTR) కలిసి వార్ 2(War) లో నటించబోతున్నారు. ఆల్రెడీ వార్ 2 కొంతభాగం షూటింగ్ జరిగింది. త్వరలోనే హృతిక్ రోషన్ వార్ 2 షూట్ లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు హృతిక్.
హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకి బెల్ట్, చేతికర్రల సాయంతో నిల్చొని ఉన్న ఫోటోని షేర్ చేసాడు. హృతిక్ కి కాళ్ళకి, నడుముకి గాయం అయినట్టు తెలుస్తుంది. అయితే ఇది షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ ల వల్ల జరిగిందా? ఏదైనా యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అసలు హృతిక్ కి ఏమైంది అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాను ఇప్పుడు వీల్ చైర్స్ లో కూర్చోవాల్సి వస్తుంది అని, క్రచెస్ పట్టుకొని నడవాలని తెలిపాడు. అయితే బలం, పట్టుదల గురించి, తన తాత, తండ్రి కూడా ఇలాంటి పరిస్థితులని చూసారని, కానీ వాళ్ళు వీల్ చైర్ లో కూర్చోడానికి ఇష్టపడలేదని, దానివల్ల ట్రీట్మెంట్స్ లేట్ అయ్యేదని తెలిపాడు. ఇలాంటి సమయంలో క్రచెస్ సాయంతో నడవడం, వీల్ చైర్ లో కూర్చోడం తప్పేమి కాదని, మనం పట్టుదల, బలంతో త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టాడు.
దీంతో హృతిక్ రోషన్ ని అలా చూడటంతో అభిమానులు అంతా కంగారుపడుతున్నారు. ఏమైంది, త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. స్టార్ హీరోలు, హీరోయిన్స్ సైతం హృతిక్ పోస్ట్ కింద త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే హృతిక్ కి ఇలా అవ్వడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఎన్టీఆర్- హృతిక్ కలిసి త్వరలో వార్ 2 షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది, కానీ ఇంతలోనే ఇలా జరగడంతో ఆ షూట్ వాయిదా పడింది, మళ్ళీ హృతిక్ ఎప్పటికి కోలుకుంటాడో, వార్ 2 ఇంకెంత ఆలస్యం అవుతుందో, తమ హీరోని బాలీవుడ్ సినిమాలో ఎప్పుడు చూస్తామో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తూ హృతిక్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.