రంగోలీ మాటలపై హృతిక్ రెస్పాండ్ : అక్కా, చెల్లెళ్ళకి స్వీట్ వార్నింగ్
ఇప్పుడు రంగోలీ వ్యాఖ్యలపై హృతిక్ రెస్పాండ్ అవుతూ, ట్విట్టర్ ద్వారా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు..

ఇప్పుడు రంగోలీ వ్యాఖ్యలపై హృతిక్ రెస్పాండ్ అవుతూ, ట్విట్టర్ ద్వారా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు..
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, నటి కంగనా రనౌత్ మధ్య తమ కొత్త సినిమాల విడుదల తేదీల విషయంలో వివాదం నెలకొంది. హృతిక్ నటిస్తున్న’ సూపర్ 30′, కంగన ‘మెంటల్ హై క్యా’ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవబోతుండడం.. ఈ వివాదానికి ఆజ్యం పోసింది. అక్క కంగన తరపునుండి చెల్లెలు రంగోలీ రంగంలోకి దిగి, అక్క సినిమా విడుదల విషయంలో నెలకొన్న వివాదం గురించి హృతిక్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘మా అక్క నీ కొవ్వు కరిగిస్తుంది, ఆమె జోలికి వస్తే ఖబడ్దార్’.. అంటూ నానా హంగామా చేసింది. ఇప్పుడు రంగోలీ వ్యాఖ్యలపై హృతిక్ రెస్పాండ్ అవుతూ, ట్విట్టర్ ద్వారా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు.
‘మీడియా సర్కిల్స్ వల్ల నేను అనుభవిస్తున్న మెంటల్ టార్చర్ మాటల్లో చెప్పలేను. ఆ టార్చర్ భరించలేక నా ‘సూపర్ 30’ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా రిలీజ్ డేట్ చేంజ్ చెయ్యమని నిర్మాతలకు చెప్పాను. గత కొద్దికాలంగా నన్ను పరోక్షంగా వేధిస్తున్న కొంతమందిని చూసి చప్పట్లు కొడుతూ, వారిని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని నేను చూస్తున్నాను. సొసైటీ పట్ల నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే ఇలాంటి విషయాలపై అందరికీ అవగాహన రావాలి.
ఆ అవగాహన ఎప్పుడొస్తుందా అని ఇప్పటికీ ఓపికగా ఎదురు చూస్తున్నాను.. ఇలాంటి నిస్సహాయ పరిస్థితులకు ముగింపు పలకాలి’ అంటూ, అక్కా, చెల్లెళ్ళకి సలహా ఇచ్చాడు హృతిక్ రోషన్.. హృతిక్ మాటలపై కంగన అండ్ కో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
— Hrithik Roshan (@iHrithik) May 9, 2019