పాయల్‌కు హూమా ఖురేషి స్ట్రాంగ్ కౌంటర్

  • Published By: sekhar ,Published On : September 22, 2020 / 05:18 PM IST
పాయల్‌కు హూమా ఖురేషి స్ట్రాంగ్ కౌంటర్

Updated On : September 22, 2020 / 5:56 PM IST

#MeeToo Huma Qureshi Reacts: నటి పాయల్ ఘోష్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనకు పలువురు మద్దతు తెలుపుతున్నారు. తాప్సీ, రామ్ గోపాల్ వర్మ, అనురాగ్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ తదితరులు అనురాగ్ మంచి వ్యక్తి అంటూ కితాబిచ్చారు.


కాగా పాయల్, అనురాగ్‌పై ఆరోపణలు చేస్తూ హూమా ఖురేషి, రిచా చద్దా, మహిగిల్ వంటి హీరోయిన్ల పేర్లు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో తన పేరు ప్రస్తావించిన పాయల్ వ్యాఖ్యలపై నటి హూమా ఖురేషి ఘాటుగా స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేసిందామె.


‘‘అనురాగ్‌తో నేను చివరిసారిగా 2012-13 సమయంలో కలిసి పనిచేశాను. ఆయన నాకు మంచి స్నేహితుడే కాదు.. మంచి టాలెంటెడ్‌ డైరెక్టర్‌ కూడా. నా వ్యక్తిగతానుభవంలో నాకు తెలిసినంత వరకు అనురాగ్‌ ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. ఒకవేళ ఆయన తమతో తప్పుగా ప్రవర్తించాడని భావించిన వారు కోర్టు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సింది.


మీడియాకెక్కడం, సోషల్‌ మీడియాలో పోరడాటం అనే విషయాలను నేను పెద్దగా నమ్మను. అందుకనే నేను రెస్పాండ్ అవకుండా ఉన్నాను. ఈ గొడవలోకి నన్ను లాగినందుకు చాలా కోపం వచ్చింది. అంతేకాదు.. ఇలాంటి పరిణామాల్లో నిరాధార ఆరోపణల వల్ల పనిచేసే ప్రదేశాల్లోని మహిళల కష్టం, శ్రమ విలువ తగ్గిపోతుంది.


స్త్రీలే కాదు.. పురుషులకు కూడా ‘మీటూ’ ఉద్యమం యొక్క పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇదే నా చివరి స్పందన. దీనికి సంబంధించిన నన్ను ఇతర వివరణల కోసం సంప్రదించకండి’’.. అంటూ పోస్ట్ చేసింది హూమా ఖురేషి..

https://www.instagram.com/p/CFbv17Ujeq-/?utm_source=ig_web_copy_link