Bellamkonda suresh : బెల్లంకొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదు
ప్రముఖ సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదయ్యింది. సినిమా నిర్మాణం కోసమని ఒక ఫైనాన్షియర్ వద్ద నుంచి విడతల వారీగా బెల్లంకొండ రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.

Bellamkonda Suresh
Bellamkonda suresh : ప్రముఖ సినీ నిర్మాత బెల్లం కొండ సురేష్ మీద చీటింగ్ కేసు నమోదయ్యింది. సినిమా నిర్మాణం కోసమని ఒక ఫైనాన్షియర్ వద్ద నుంచి విడతల వారీగా బెల్లంకొండ రూ.85 లక్షలు అప్పుగా తీసుకున్నాడు.
2018 లో మొదట రూ. 50 లక్షలు అప్పుగా తీసుకన్నాడని… తరువాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత సినిమా చేస్తున్నానని నమ్మించి మళ్లీ డబ్బు తీసుకున్నట్లు బంజారా హిల్స్ కు చెందిన వీఎల్ శ్రావణ్ కుమార్ అనే ఫైనాన్షియర్ తెలిపాడు.
Also Read : Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!
తీసుకున్న డబ్బులతో సినిమా నిర్మాణం మొదలెట్టకపోగా డబ్బుకూడా తిరిగి ఇవ్వలేదని… డబ్బు తిరిగి ఇవ్వమని కోరితే సురేష్ అతని కుమారుడు బెదిరించటంతో శ్రావణ్ కుమార్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో హైదారాబాద్ సీసీఎస్ పోలీసులు నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కేసు నమోదు చేశారు.