వర్మ ట్వీట్ చేశాడు.. జీహెచ్‌ఎంసీ వాళ్లు ఫైన్ వేశారు.. ఎందుకంటే..

  • Published By: sekhar ,Published On : July 28, 2020 / 01:11 PM IST
వర్మ ట్వీట్ చేశాడు.. జీహెచ్‌ఎంసీ వాళ్లు ఫైన్ వేశారు.. ఎందుకంటే..

Updated On : July 28, 2020 / 2:05 PM IST

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్’ సినిమాతో గతకొద్ది రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌ణ‌య్ హ‌త్య ఘ‌ట‌న ఆధారంగా ‘మ‌ర్డ‌ర్‌’ (కుటుంబ కథా చిత్రమ్).. అనే సినిమా చేస్తున్న వర్మ మంగళవారం ట్రైల‌ర్‌ విడుద‌ల చేసి వార్తల్లో నిలిచాడు.

ఇదిలా ఉంటే ఆర్జీవీ హైదరబాద్ జీహెచ్‌ఎంసీ జరిమానా విధించింది. జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధుంగా వర్మ పోస్టర్ వేశాడంటూ జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం రూ.4 వేలు ఫైన్ వేశారు. లాక్‌డౌన్ తర్వాత పడిన మొట్టమొదటి పోస్టర్ మాదే అంటూ ఇటీవల వర్మ ‘పవర్‌స్టార్’ సినిమా పోస్టర్ ఫొటోను షేర్ చేశాడు. దీ

నిపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి ట్వీట్‌ ఆధారాంగా జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశాడు. తన సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ ఆస్తిని ఉపయోగించుకున్నందుకు గానే వర్మకు ఫైన్ వేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగానికి తెలిపాడు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఈవీడీఎం విభాగం ఆర్జీవీకి రూ.4 వేలు జరిమానా విధించారు. మరి వర్మ ఫైన్ కడతాడో లేక దీని గురించి కూడా ట్వీట్ వేస్తాడేమో చూడాలి.