ఇదే కదా ఇదే కదా నీ కథ- మనసుని హత్తుకునే సాంగ్

రీసెంట్‌గా ఆడియోలో లేని 'ఇదే కదా నీ కథ' అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది..

  • Published By: sekhar ,Published On : May 4, 2019 / 04:50 AM IST
ఇదే కదా ఇదే కదా నీ కథ- మనసుని హత్తుకునే సాంగ్

Updated On : May 4, 2019 / 4:50 AM IST

రీసెంట్‌గా ఆడియోలో లేని ‘ఇదే కదా నీ కథ’ అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది..

సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహర్షి.. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ హీరోగా నటిస్తున్న 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్ అండ్ సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా ఆడియోలో లేని ‘ఇదే కదా నీ కథ’ అనే సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

ది సోల్ ఆఫ్ రిషి పేరుతో రిలీజ్ చేసిన ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఉంది. ట్రైలర్ చివర్లో ఈ పాట లిరిక్స్ కొన్ని వినబడతాయి. మహేష్ వ్యవసాయం చేసేటప్పుడు ఈ పాట వస్తుందని విజువల్స్ చూస్తే అర్ధమవుతుంది. మహేష్ క్యారెక్టర్‌లో షేడ్స్‌‌లానే, అబ్రోడ్, కాలేజ్, పొలాల విజువల్స్ కనిపించాయి పాటలో. శ్రీమణి అద్భుతమైన లిరిక్స్ రాయగా, విజయ్ ప్రకాష్ హృదయాన్ని హత్తుకునేలా పాడాడు. మే 9న మహర్షి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

వాచ్ ఇదే కదా నీ కథ సాంగ్..