Rakshita: ‘ఇడియట్’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్!

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.., గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరీ పాటలు.. 'చంటీ... ఐ లవ్యూ రా..' ఈ డైలాగ్స్ చాలు మనకి రక్షిత ఇట్టే గుర్తొచ్చేస్తుంది. రవితేజ ఇడియట్ తో తెలుగులో మొదలైన రక్షిత కెరీర్ ఎన్టీఆర్, మహేష్, నాగార్జున, జగపతి బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ రేంజికి ఎదిగింది.

Rakshita: ‘ఇడియట్’ హీరోయిన్.. షాకింగ్ లుక్ వైరల్!

Idiot Heroine Rakshitha Shocking Look Viral

Updated On : June 20, 2021 / 8:32 PM IST

Rakshita: చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే.., గిచ్చి గిచ్చి చంపుతుంది గ్రీకు సుందరీ పాటలు.. ‘చంటీ… ఐ లవ్యూ రా..’ ఈ డైలాగ్స్ చాలు మనకి రక్షిత ఇట్టే గుర్తొచ్చేస్తుంది. రవితేజ ఇడియట్ తో తెలుగులో మొదలైన రక్షిత కెరీర్ ఎన్టీఆర్, మహేష్, నాగార్జున, జగపతి బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ రేంజికి ఎదిగింది. అదే సమయంలో కన్నడలో కూడా స్టార్ హీరోలకు జోడీ కట్టి దక్షణాది బిజీగా స్టార్ గా ఓ వెలుగుతూనే ఓ కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.

అయితే.. ఒకనాడు కుర్రాళ్లకు కలలరాణిగా వెలిగిన రక్షిత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఓ బాబుకి జన్మనిచ్చిన అనంతరం బరువు పెరిగిన రక్షిత ఇప్పుడు అసలు ఏ మాత్రం పోల్చుకోలేని స్థితిలో బరువు పెరిగిపోయింది. థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు ఆ మధ్య ఓ రియాల్టీ షోలో చెప్పుకొచ్చిన రక్షిత కరోనా లాక్ డౌన్ తర్వాత విపరీతంగా బరువు పెరిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా.. రక్షిత షాకింగ్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

ఇడియట్ నాటి హీరోయిన్.. ఇప్పుడు రక్షిత ఫోటోలను పోల్చి చూస్తున్న అభిమానులు దర్శకుడు పూరి జగన్నాద్ పోడ్ కాస్ట్ కామెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు. పూరి ఈ మధ్యనే పోడ్ కాస్ట్ లో హీరోయిన్స్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో దేవతలుగా ఉంటారని.. అలాంటి దేవతలు కూడా పెళ్లిళ్లు చేసుకొని.. పిల్లల్ని కనేసి మనుషులుగా మారిపోవడం ఏ మాత్రం సమంజసం కాదని కామెంట్స్ చేశారు. దీంతో పూరి తెలుగు సినిమాకు పరిచయం చేసిన రక్షితనే ఉదాహరణగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.