‘భారతీయుడు-2’ ఫస్ట్ లుక్.. అదుర్స్!
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం భారతీయుడు-2 ఫస్ట్ లుక్ విడుదలైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర దర్శకుడు శంకర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.

విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం భారతీయుడు-2 ఫస్ట్ లుక్ విడుదలైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర దర్శకుడు శంకర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న కొత్త చిత్రం భారతీయుడు-2 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని చిత్ర దర్శకుడు శంకర్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా ‘భారతీయుడు-2’ చిత్రాన్ని నిర్మించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథనాయకుడు కమల్ హాసన్ సరసన కాజల్ నటిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి 18 నుంచి భారతీయుడు -2 మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శ్రుతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శంకర్ దర్శకత్వం వహించే ఈ భారతీయుడు-2 స్వీకెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ విడుదల చేసిన భారతీయుడు-2 ఫస్ట్ లుక్ పోస్టర్ లో.. కమల్ వర్మ కళను ప్రదర్శిస్తూ కనిపించారు. దర్శకుడు శంకర్.. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.. హ్యాపీ పొంగల్ అంటూ ట్వీట్ చేసి #indian2 హ్యాష్ ట్యాగ్ జత చేశారు.
భారతీయుడు-2 ఫస్ట్ లుక్ పోస్టర్ ఇదే..
#indian2 Hi everyone! “ Happy Pongal” pic.twitter.com/rgiuCBBtLq
— Shankar Shanmugham (@shankarshanmugh) January 14, 2019