Chiranjeevi : భారతదేశ చలనచిత్ర రంగం నుంచి చిరంజీవికి అరుదైన గౌరవం..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని భారతదేశ చలనచిత్ర రంగం అరుదైన గౌరవంతో సత్కరించనుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రసిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ, నేడు టాలీవుడ్ కి గాడ్‌ఫాదర్ అనిపించుకుంటున్నాడు. సినిమాలోకి రావాలనే సత్యదేవ్, కార్తికేయ వంటి నేటితరం హీరోలకు కూడా చిరు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Chiranjeevi : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని భారతదేశ చలనచిత్ర రంగం అరుదైన గౌరవంతో సత్కరించనుంది. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ప్రసిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి అంచలంచలుగా ఎదుగుతూ, నేడు టాలీవుడ్ కి గాడ్‌ఫాదర్ అనిపించుకుంటున్నాడు. సినిమాలోకి రావాలనే సత్యదేవ్, కార్తికేయ వంటి నేటితరం హీరోలకు కూడా చిరు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

Chiranjeevi : పవన్ రాజకీయాలకు తగినవాడు.. పాలిటిక్స్ గురించి మరోసారి మాట్లాడిన చిరంజీవి..

కాగా గోవాలో ఆదివారం నుంచి భారత 53వ చలన చిత్రోత్సవం వేడుకలు జరగనున్నాయి. ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 28 వరకు కొనసాగనుంది. ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరు కానున్నారు. అయితే ఈ 53వ చలన చిత్రోత్సవంలో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక గుర్తింపు దక్కింది.

దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో 150 పైగా సినిమాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవిని 2022 గాను “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్”గా ప్రకటించింది. గతంలో ఈ పురస్కారాన్ని సినీ పరిశ్రమ నుంచి అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, ఇళయరాజా, బాలసుబ్రమణ్యం వంటి తారలు అందుకున్నారు. ఇప్పుడు ఈ అవార్డు చిరంజీవి అందుకోవడంతో తెలుగు పరిశ్రమ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు