Indraja : ‘సీఎం పెళ్ళాం’గా రాబోతున్న ఇంద్రజ..

త్వరలోనే సీఎం పెళ్లాం సినిమా రిలీజ్ కానుంది.

Indraja : ‘సీఎం పెళ్ళాం’గా రాబోతున్న ఇంద్రజ..

indraja CM Pellam Movie Releasing Soon

Updated On : March 23, 2025 / 8:00 PM IST

Indraja : ఇంద్రజ, అజయ్, జయసుధ, సుమన్.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘సీఎం పెళ్లాం’. RK సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాణంలో గడ్డం రమణా రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సీఎం పెళ్లాం సినిమా ప్రమోషనల్ సాంగ్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక సినిమా ఇది. సీఎంగా అజయ్, ఆయన భార్య పాత్రలో ఇంద్రజ ఆకట్టుకుంటారు. త్వరలోనే మా సీఎం పెళ్లాం సినిమా రిలీజ్ కానుంది అని తెలిపారు.

Also Read : Richest Comedian : దేశంలోనే అత్యంత ధనిక కమెడియన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. రణబీర్ కపూర్, ప్రభాస్, రజనీకాంత్ కంటే రిచ్..

నటుడు అజయ్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ చూశాక చాలా ఎమోషనల్ అయ్యాను. నేను సీఎంగా నటిస్తే, నా భార్య పాత్రలో ఇంద్రజ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. సమయపాలన ఇంద్రజ గారిని చూసి నేర్చుకున్నా. ఈ సినిమాతో డైరెక్టర్ కు మంచి పేరొస్తుంది అని అన్నారు.

indraja CM Pellam Movie Releasing Soon

నటి ఇంద్రజ మాట్లాడుతూ.. సీఎం పెళ్లాం సినిమా ఒక మంచి సోషల్ కాన్సెప్ట్ తో వస్తోంది. సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుంది అని ఆసక్తికర పాయింట్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఆలోచింపజేసే సినిమా ఇది. మీ రియల్ లైఫ్ లో చూసినవి, విన్నవి, జరిగిన ఇన్సిడెంట్స్ మా సీఎం పెళ్లాం మూవీలో చూస్తారు అని తెలిపారు.

Also Read : Allu Arjun: అబుదాబిలోని ఆ మందిరంలో అల్లు అర్జున్.. వీడియో చూశారా? 

డైరెక్టర్ గడ్డం రమణా రెడ్డి మాట్లాడుతూ.. నేడు రిలీజ్ చేసిన సాంగ్ హైదరాబాద్ నగరం నేపథ్యంగా రూపొందించాం. మన నగరం ఎలా ఉంది అని ఈ పాటలో చూపించాం. నేను అమెరికాలో ఉంటాను. కుండపోత వర్షం పడినా అక్కడ చుక్క నీరు నగరంలో నిలవదు. ఇక్కడ వర్షం వస్తే అంతే. నేను ఎవరినీ విమర్శించడం లేదు. నగరం బాగుండాలనే తపనతో చెప్తున్నా. ఒకే ఒక్కడు సినిమాలో వన్ డే సీఎం లాగా ఈ సినిమాలో సీఎం పెళ్లాం బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నా అని తెలిపారు.