Sudigali Sudheer : అతని విషయంలో అదే బాధ.. సుడిగాలి సుధీర్ పై ఇంద్రజ కామెంట్స్ వైరల్..

Sudigali Sudheer

Sudigali Sudheer : అతని విషయంలో అదే బాధ.. సుడిగాలి సుధీర్ పై ఇంద్రజ కామెంట్స్ వైరల్..

Sudigali Sudheer

Updated On : December 7, 2025 / 8:00 PM IST

Sudigali Sudheer : ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మరో పక్క జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడింది.(Sudigali Sudheer)

ఈ ఇంటర్వ్యూలో ఇంద్రజ సుడిగాలి సుధీర్ గురించి కూడా మాట్లాడింది. సుడిగాలి సుధీర్ – ఇంద్రజ కలిసి సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో తల్లి కొడుకులుగా నటించారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో పలు ఎపిసోడ్స్ లో వీరిద్దరూ పాల్గొన్నారు.

Also See : Anasuya Bharadwaj : మడతమంచం పై పడుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ.. లేగదూడతో అనసూయ ఫొటోలు..

ఇంద్రజ సుధీర్ గురించి మాట్లాడుతూ.. సిద్ధూ(సుధీర్) నన్ను అమ్మ అని పిలుస్తాడు. అతను చేరుకోవాల్సిన పొజిషన్ కి ఇంకా ఎందుకు చేరుకోలేదు అని ఒక బాధ ఉంది. తనకు నేను బాగా అటాచ్ అయ్యాను. ఆయన శ్రీదేవి కంపెనీ షో మానేసి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ కలిసి చేయలేదు. కానీ అపుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాను. చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. నాకు కొడుకు లాంటివాడు. దేవుడు ఇచ్చిన అనుబంధం అది. సుధీర్ యాంకరింగ్ నాకు నచ్చుతుంది కానీ అతన్ని హీరోగా చూడాలి, పెద్ద స్టార్ హీరో అవ్వాలని కోరుకుంటాను అని తెలిపింది.