Roja – Indraja : రోజాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని ఒక్కసారి పిలిస్తే.. ఇక్కడే సెటిల్ అయిపోయిన హీరోయిన్..
ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వచ్చిన ఎంట్రీ గురించి మాట్లాడింది.(Roja - Indraja)
Roja - Indraja
Roja – Indraja : ఒకప్పటి హీరోయిన్ ఇంద్రజ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమాలు చేస్తుంది. మరో పక్క జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ.. లాంటి పలు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఇంద్రజ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో ఇంద్రజ జబర్దస్త్ జడ్జిగా వచ్చిన ఎంట్రీ గురించి మాట్లాడింది.(Roja – Indraja)
ఇంద్రజ మాట్లాడుతూ.. కరోనా తర్వాత జబర్దస్త్ ఆఫర్ వచ్చింది. ఒకసారి రోజాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని నన్ను పిలిచారు ఒక ఎపిసోడ్ కి గెస్ట్ జడ్జిగా. సరే అని వెళ్ళాను. నేను చేసిన ఒక ఎపిసోడ్ తో వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. దాంతో అదే రోజు సెకండ్ ఎపిసోడ్ కి కూడా కంటిన్యూ అవ్వమన్నారు. సెకండ్ ఎపిసోడ్ కూడా చేసి ఇంటికి వచ్చేసాను. నాకు ఒక్క రోజులోనే కాల్ వచ్చింది రోజా గారు వచ్చేవరకు మీరే జడ్జిగా రావాలి అని. అక్కడికి వెళ్ళాక నాకు తెలిసింది. నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోకి దాదాపు 3000 కామెంట్స్ వస్తే అందిలో 2800 కామెంట్స్ నా గురించే పాజిటివ్ గా వచ్చాయి. పబ్లిక్ అలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేసరికి నన్నే జడ్జిగా తీసుకున్నారు. అని తెలిపింది.
Also Read : Indraja : వల్గర్ డ్రెస్ లు వేసేవాళ్లపై ఇంద్రజ హాట్ కామెంట్స్ వైరల్.. జారిపోతాయేమో..
అలా ఒక ఎపిసోడ్ కోసం రోజా లేదని వచ్చిన ఇంద్రజ ఇప్పుడు జబర్దస్త్ కి జడ్జిగా ఫిక్స్ అయిపోయింది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా చేస్తుంది. టీవీ షోలతో ఆమె తరం ప్రేక్షకులకు మళ్ళీ కనెక్ట్ అయ్యారు ఇంద్రజ.
