Pushpa: షూటింగ్‌కి అంతరాయం.. పుష్ప క్రిస్టమస్‌కి రావడం కష్టమేనా?
అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చేసి పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో పుష్ప మీద..

Pushpa
Pushpa: అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చేసి పాన్ ఇండియా స్థాయికి చేర్చిన సినిమా పుష్ప. సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో పుష్ప మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా విడుదలలో ఇప్పటికే ఒకేసారి వాయిదా పడింది. ముందుగా ఆగష్టులో ఈసినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ అప్పుడు కరోనా ప్రభావంతో అన్ని సినిమాల మాదిరే ఈ సినిమాకు కూడా బ్రేకులు పడ్డాయి.
Konda Polam: మెగా క్రేజ్.. దుమ్మురేపుతున్న ‘కొండపొలం’ ట్రైలర్!
అయితే, ఇప్పుడు దాదాపుగా అన్ని సినిమాలు నిర్విరామంగా ముమ్మర షూటింగ్ లో ఉన్నాయి. పుష్ప కూడా జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది. కాగా.. ఇప్పుడు తుఫాన్ ప్రభావంతో వర్షాలు పుష్ప సినిమా షూటింగ్ కు అంతరాయం కలిగించినట్లుగా తెలుస్తుంది. పూర్తిస్థాయి అటవీ నేపథ్యంలో సాగే ఈ సినిమా మారేడుమిల్లి అడవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే, ఇక్కడ భారీ వర్షాల కారణంగా షూటింగుకు అంతరాయం కలుగుతుందట.
Bomma Blockbuster: నీయయ్య పుట్టడానికే ఇన్ని యుద్దాలు చేసిన నీకు లైఫ్ ఒక లెక్కనా?
ప్రస్తుతం పుష్పకి సంబంధించి ఒక పాట చిత్రీకరణ జరుగుతుండగా గత రెండు రోజులుగా షూటింగ్ కి అంతరాయం కలుగుతుంది. షూటింగ్ లో ఉన్న పాటతో పాటు మరో పాట, మరి కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. మరోవైపు మేకర్స్ ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈలోగా బ్యాలెన్స్ షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేయడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మేకర్స్ నుండి ప్రకటన వస్తే తప్ప దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.