‘రాధే శ్యామ్’ లో ‘ప్రేరణ’ గా పూజా హెగ్డే..

Pooja Hegde: రెబల్ స్టార్ నటిస్తున్న మరో పాన్ ఇండియన్ మూవీ.. ‘‘రాధే శ్యామ్’’.. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి గోపికృష్ణా మూవీస్ సమర్పణలో, UV Creations, TSeries సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ‘జిల్’ ఫేం రాధ కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణంరాజు కుమార్తె, ప్రభాస్ సోదరి Praseedha Uppalapati నిర్మాతగా పరిచయమవుతున్నారు.
హాట్ బ్యూటి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. మంగళవారం (అక్టోబర్ 13) ఆమె పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘రాధే శ్యామ్’లో పూజా ‘ప్రేరణ’ అనే పాత్రలో కనిపించనుంది. తన లుక్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌తో సహా మూవీ టీమ్ అంతా సోషల్ మీడియా ద్వారా పూజా హెగ్డేకు పుట్టినరోజు విషెస్ తెలిపారు. ‘రాధే శ్యామ్’ చిత్రీకరణ తుదిదశలో ఉంది.
https://www.instagram.com/p/CGRTXxdpQ0E/?utm_source=ig_web_copy_link