Shahrukh Khan : షారుఖ్ ఖాతాలో ఇంకో క్యూట్ ఫ్యాన్.. ఇర్ఫాన్ పఠాన్ చిన్న కొడుకుపై షారుఖ్ ట్వీట్..
తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలోని పాటను పెట్టగా సంవత్సరం పైన వయసు ఉన్న తన చిన్న కొడుకు ఫోన్ పట్టుకొని క్యూట్ గా ఎగురుతూ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇది వీడియోగా తీసి......................

Irfan Pathan shares his son cute video shahrukh Khan Reply and Tweet
Shahrukh Khan : బాలీవుడ్(Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్(shahrukh Khan) చాలా గ్యాప్ తర్వాతా ఇటీవల జనవరిలో పఠాన్(Pathaan) సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఏకంగా 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఫ్లాప్స్ తో సతమతమవుతున్న బాలీవుడ్ కు హిట్ ఇచ్చాడు. పఠాన్ షారుఖ్ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇక షారుఖ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. పఠాన్ సినిమా తర్వాత నుంచి మరోసారి సోషల్ మీడియాలో షారుఖ్ బాగా వైరల్ అవుతున్నారు.
తాజాగా మాజీ టీమిండియా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాలోని పాటను పెట్టగా సంవత్సరం పైన వయసు ఉన్న తన చిన్న కొడుకు ఫోన్ పట్టుకొని క్యూట్ గా ఎగురుతూ డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఇది వీడియోగా తీసి ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్ లో షేర్ చేసి షారుఖ్ ని ట్యాగ్ చేస్తూ.. ఖాన్ సాబ్, నీ లిస్ట్ లో ఇంకో క్యూట్ ఫ్యాన్ యాడ్ అయ్యాడు అని పోస్ట్ చేశాడు. ఈ వీడియో చుసిన షారుఖ్ దీనికి రిప్లై కూడా ఇచ్చాడు.
ఇర్ఫాన్ పఠాన్ షేర్ చేసిన వీడియోని షేర్ చేస్తూ షారుఖ్.. అతను నీకంటే చాలా ట్యాలెంటు ఉన్నవాడు.. లిటిల్ పఠాన్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. చిన్న పిల్లోడి క్యూట్ డ్యాన్స్ చూసి మురిసిపోయి షారుఖ్ ఈ వీడియో షేర్ చేసాడని అభిమానులు అంటున్నారు. అలాగే ఇర్ఫాన్ పఠాన్ కొడుకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం షారుఖ్ మరో రెండు సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు.
Yeh tumse zyaada talented nikla….chota Pathaan https://t.co/gK0rumQC5a
— Shah Rukh Khan (@iamsrk) March 22, 2023