సంజూ బాబా నాన్నకు చాలా హెల్ప్ చేశారు.. ఆయనో టైగర్.. ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఎమోషనల్ పోస్ట్..

  • Published By: sekhar ,Published On : August 20, 2020 / 12:36 PM IST
సంజూ బాబా నాన్నకు చాలా హెల్ప్ చేశారు.. ఆయనో టైగర్.. ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఎమోషనల్ పోస్ట్..

Updated On : August 20, 2020 / 3:17 PM IST

Irrfan Khan’s son Emotional post: బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ ఇటీవ‌ల‌ తాను వైద్య చికిత్స కోసం కొంత విరామం తీసుకుంటున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. ఇది సంజూభాయ్ అభిమానులను, పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం సంజ‌య్ క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు.ఈ నేప‌ధ్యంలో బాలీవుడ్ దివంగ‌త న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్… సంజయ్‌ద‌త్‌ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇర్ఫాన్, సంజయ్‌ల మధ్యగల అనుబంధాన్ని తెలుపుతూ బాబిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతోంది..

‘‘ర‌చ‌యిత‌లు ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తుంటారు. అయితే నేను ర‌చ‌యిత‌ను కాను. అయితే జ‌ర్న‌లిస్టులకు ఒక విన‌తి చేయాల‌నే ఉద్దేశంతో దీనిని రాస్తున్నాను. మ‌నంద‌రిలోనూ మాన‌వ‌త్వం ఉంటుంది. అందుకే సంజూభాయ్ కుటుంబానికి కాస్త స్పేస్ ఇవ్వండి. మా నాన్న‌గారు అనారోగ్యం పాల‌ైనపుడు, ముందుగా స‌హాయం అందించిన‌ వారిలో సంజూభాయ్ ఉన్నారు.

అలాగే నాన్న‌గారు పోయిన‌ప్పుడు కూడా సంజూభాయ్ మాకు అండ‌గా నిలిచారు. మీడియా ఒత్తిడి లేకుండా, అత‌ని పోరాటాన్ని అత‌న్నే కొన‌సాగించ‌నివ్వండి. సంజూభాయ్ ఒక టైగ‌ర్‌. సంజూ బాబా మ‌రోమారు హిట్ ఇచ్చేందుకు తిరిగి వ‌స్తారు’’ అంటూ బాబిల్ చేసిన భావోద్వేగభరితమైన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
https://www.instagram.com/p/CEFxfX-pTqp/?utm_source=ig_web_copy_link