Irumudi : మళ్ళీ థియేటర్స్ ఇష్యూ.. రవితేజ ‘ఇరుముడి’కి ఎఫెక్ట్.. నిర్మాతల మధ్య రగడ..?
నైజాంలో ఈ సినిమాకు బుధవారం నుంచి థియేటర్స్ కోత పడనున్నాయి.(Irumudi)
Irumudi
Irumudi : నిర్మాతల మధ్య, డిస్ట్రిబ్యూటర్ల మధ్య థియేటర్స్ ఇష్యూ పండగల సమయంలో, ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ సమయంలో రెగ్యులర్ గా ఉంటుంది. నైజాంలో ఎక్కువగా దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీస్ వర్సెస్ ఆసియన్ సురేష్ అన్నట్టు ఈ గొడవ సాగుతుంది. ఇటీవల అనేకమార్లు దిల్ రాజు తన సినిమాల కోసం నైజాంలో వేరే సినిమాలకు థియేటర్స్ ఇవ్వట్లేదు అని విమర్శలు వచ్చాయి. స్టార్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా మీడియా ముందే చెప్పుకొని వాపోయారు.
ఇప్పుడు ఇదే గొడవ మళ్ళీ మొదలయింది. ఇటీవల మైత్రి నిర్మాణంలో వచ్చిన రవితేజ ఇరుముడి సినిమా భారీ హిట్ కొట్టి థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమా హిట్ టాక్ వచ్చాక థియేటర్స్ సంఖ్య ఇంకా పెరిగింది. సినిమా రిలీజయి మూడు రోజులు అయిపోయినా ఇవాళ సోమవారం నాలుగో రోజు కూడా థియేటర్స్ లో మంచి బుకింగ్స్ అవుతున్నాయి. ఆ రేంజ్ లో ఇరుముడి సినిమా హిట్ అయింది. ఇప్పటికే 80 కోట్లు సాధించి వంద కోట్లకు దూసుకుపోతుంది.
Also Read : Prince Cecil : పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫొటోలు వైరల్..
అయితే నైజాంలో ఈ సినిమాకు బుధవారం నుంచి థియేటర్స్ కోత పడనున్నాయి. యశ్ టాక్సిక్ సినిమాని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. నైజాంలో టాక్సిక్ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు ఇరుముడి సినిమాని థియేటర్స్ నుంచి తీసేస్తున్నారు. దీంతో మరోసారి ఈ థియేటర్స్ వివాదం చర్చగా మారింది. మరో సారి దిల్ రాజు వర్సెస్ మైత్రి అనే టాక్ నడుస్తుంది.
టాక్సిక్ సినిమాని యూత్, ఫ్యాన్స్ తప్ప ఎవరూ పట్టించుకోవట్లేదు. అది ఎలాగో అడల్ట్ సినిమా కాబట్టి పిల్లల్ని రానివ్వరు. కానీ ఇరుముడి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయింది. పిల్లలు కూడా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. ప్రేక్షకులు థియేటర్స్ లో కన్నీళ్లు పెడుతున్నారు. ఇలాంటి మంచి సినిమాని థియేటర్స్ నుంచి తీసేసి టాక్సిక్ కి ఇస్తారా అని విమర్శలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం ఇచ్చినా ఒక్కరోజే రెండో రోజుకి మళ్ళీ టాక్సిక్ ని ఎవరూ పట్టించుకోకపోతే ఇరుముడి సినిమానే వేస్తారు అని అంటున్నారు. రవితేజ ఫ్యాన్స్ అయితే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు.
Also See : Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..
మరో వైపు క్లాస్ గా నడుస్తున్న విశ్వనాధ్ & సన్స్ సినిమాకు కూడా టాక్సిక్ సినిమా కోసం థియేటర్స్ విషయంలో కోత పడబోతుందని తెలుస్తుంది. రాక రాక చాన్నాళ్లకు రవితేజకు హిట్ వచ్చి కలెక్షన్స్ సాధిస్తుంటే ఇప్పుడు టాక్సిక్ సినిమా ఎఫెక్ట్ పడేలా ఉందని బాధపడుతున్నారు ఫ్యాన్స్.
