Irumudi pre release event : హైదరాబాద్‌లో ఇరుముడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?
రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు (Irumudi pre release event) డేట్ ఫిక్సైంది
Irumudi pre release event on august 16th at Shilpakalavedika Hyderabad
Irumudi pre release event : తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రియ భవాని శంకర్ కథానాయిక. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రం నుంచి ది మోస్ట్ అవైటెడ్ సాంగ్ ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ ఆగస్టు 16న విడుదల కానుంది. ఇక అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.
George Krish : శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ మూవీ పూజా కార్యక్రమం.. ఫోటోలు..
View this post on Instagram
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడులైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ మేళవింపుగా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది.
