Itlu Me Yedhava : ‘ఇట్లు మీ ఎదవ’.. ఈ టైటిల్ ఇచ్చింది నేనే..
త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మీ ఎదవ.(Itlu Me Yedhava)
Itlu Me Yedhava
Itlu Me Yedhava : త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇట్లు మీ ఎదవ. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహితీ అవంచ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.(Itlu Me Yedhava)
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. ఎవరూ కూడా నేను కొత్త వాడినని చూడలేదు. అనుభవం ఉన్న వ్యక్తులానే నన్ను చూసుకున్నారు. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రి కొడుకులు కథ, తండ్రి కూతుర్ల కథ, ఒక అమ్మాయి అబ్బాయి కథ.. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. నాకు బాపు గారి సినిమాకు చేసే అవకాశం రాలేదు. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని అనిపించింది. ఈ సినిమాకి మూవీ టైటిల్ ఇచ్చింది కూడా నేనే. సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ ఇంకొకటి ఉండదు ఈ కథకు అనిపించింది. యూత్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి ఈ సినిమాని చూపించాలి అన్నారు.
Mass Jathara Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ.. రైల్వే పోలీస్ గా రవితేజ ఏం చేసాడు?
నిర్మాత బళ్లారి శంకర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. పట్నాయక్ గారు మ్యూజిక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మాకు సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ బుచ్చిబాబు గారికి, హీరో శ్రీకాంత్ గారికి, నిర్మాత కేఎస్ రామారావు గారికి కృతజ్ఞతలు అని అన్నారు.
