Selfish : దిల్ రాజు, సుకుమార్ కలయికతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న లవ్ టుడే భామ..

లవ్ టుడే సినిమాతో తెలుగు వాళ్ళకి దగ్గరైన ఇవానా.. దిల్ రాజు, సుకుమార్ కలయికలో ఆశిష్ రెడ్డితో ఒక సినిమా చేయబోతుంది. ఆ మూవీ నుంచి..

Selfish : దిల్ రాజు, సుకుమార్ కలయికతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న లవ్ టుడే భామ..

Ivana tollywood entry under dil raju and sukumar writings

Updated On : April 22, 2023 / 3:07 PM IST

Selfish : ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తూ సత్తా చాటుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం లవ్ టుడే (Love Today). తమిళ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ డైరెక్ట్ చేశాడు. హీరోయిన్ గా ఇవానా (Ivana) నటించింది. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు తన బ్యానర్ పై రిలీజ్ చేశాడు. ఈ మూవీ ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ చిత్రంలో నటించిన ప్రదీప్ అండ్ ఇవానా కి కూడా తెలుగులో ఫాలోయింగ్ ఏర్పడింది.

Virupaksha Collections: విరూపాక్ష ఫస్ట్ డే కలెక్షన్స్.. తేజు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడుగా!

తాజాగా ఇవానా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. దిల్ రాజు వారసుడుగా తెలుగు ఆడియన్స్ కి హీరోగా పరిచమైన నటుడు ఆశిష్ రెడ్డి (Ashish Reddy). మొదటి సినిమా ‘రౌడీ బాయ్స్’ అంటూ ఒక యూత్ ఫుల్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ని అందుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమాని సిద్ధం చేస్తున్నాడు. ‘సెల్ఫిష్’ అనే ఒక కేజ్రీ స్టోరీతో ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. తమిళ స్టార్ హీరో ధనుష్ చేతులు మీదుగా మొదలైన ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.

Salman Khan: సల్మాన్ ఖాన్‌కు కలిసొచ్చిన ఈద్.. ఎన్ని సినిమాలకు ఎంత వసూళ్లో తెలుసా?

ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానా నటిస్తున్నట్లు ప్రకటించారు. మూవీలోని చైత్ర పాత్రని పరిచయం చేస్తూ ఇవానా పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే యూత్ ని ఆకట్టుకునే లైన్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీంతో చిత్రం పై మంచి బజ్ ఉంది. విశాల్ కాశీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.