Jabardasth Prasad Health: మరింత క్షీణించిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం

జబర్దస్త్ కామెడీ షోలో నాన్-స్టాప్ పంచులతో తనకంటూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు ‘పంచ్’ ప్రసాద్‌. గతకొంత కాలంగా పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.

Jabardasth Prasad Health: మరింత క్షీణించిన జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం

Jabardasth Comedian Punch Prasad Health More Critical

Updated On : April 9, 2023 / 6:53 PM IST

Jabardasth Prasad: జబర్దస్త్ కామెడీ షో బుల్లితెరపై గతకొన్నేళ్లుగా ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో కొందరు ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. ఇక మరికొందరు బుల్లితెరకే పరిమితమై, తమదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నారు. వారిలో నాన్-స్టాప్ పంచులతో తనకంటూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు ‘పంచ్’ ప్రసాద్‌.

Punch Prasad: నడవలేని స్థితిలో జబర్దస్త్ కమెడియన్.. ఆందోళనలో ఫ్యాన్స్!

అయితే, పంచ్ ప్రసాద్ గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడు కిడ్నీ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నాడు. దీనికోసం రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అయినా కూడా అతడి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు రాలేదని తెలుస్తోంది. అంతేగాక, ప్రసాద్‌కు ఇప్పుడు ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తీవ్ర జ్వరంతో ప్రసాద్ ఆసుపత్రిలో చేరగా, అతడు గొంతు సమస్యతో బాధపడుతున్నట్లుగా అతడి భార్య తెలిపింది.

Jabardasth : నువ్వంటే నిజంగానే ఇష్టం ఇమ్ము.. మీ అమ్మకి చెప్పు.. ఓపెన్ అయిన వర్ష..

ఇప్పటికే అతడికి థైరాయిడ్ సమస్య ఉందని.. ఇప్పుడు అది మరింత తీవ్రంగా మారిందని.. డాక్టర్లు అతడికి సర్జరీ చేయాలని చెప్పినట్లుగా ప్రసాద్ భార్య పేర్కొంది. అయితే ప్రసాద్ కాలికి లెగ్ ఇన్ఫెక్షన్ ఉండటంతో అది నయం అయిన తరువాతే సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారట. దీంతో ప్రసాద్ భార్య ఆందోళన చెందుతున్నట్లుగా తెలిపింది. ఏదేమైనా కొత్త అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.