Kirrak RP : కొత్తరకం కర్రీ పాయింట్ పెట్టిన జబర్దస్త్ నటుడు..

తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ. ఆర్పీది నెల్లూరు. నెల్లూరు లో చేపల పులుసు ఫేమస్ అని మనకి తెలిసిందే. అక్కడి చేపల పులుసుని ఇక్కడి వాళ్ళకి అదే టేస్ట్ తో అందచేయాలని....................

Kirrak RP : కొత్తరకం కర్రీ పాయింట్ పెట్టిన జబర్దస్త్ నటుడు..

jabardasth kirrak RP opens Nelluru Peddareddi chepala pulusu curry point

Updated On : December 12, 2022 / 7:43 AM IST

Kirrak RP : జబర్దస్త్ తో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ. అనంతరం వేరే టీవీ షోలు, సినిమాలలోనూ కనిపించాడు. ప్రస్తుతం కొన్ని టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉన్నాడు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు ఆర్పీ. మరోపక్క డైరెక్టర్ గా సినిమా కూడా చేయబోతున్నాడు. తాజాగా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు కిరాక్ ఆర్పీ.

హైదరాబాద్ లో బెస్ట్ బిజినెస్ అంటే ఫుడ్ బిజినెస్. అందుకే ఆర్పీ కర్రీపాయింట్ ని పెట్టాడు. కర్రీ పాయింట్ అంటే చిన్నగా తీసిపారేయకండి. తన స్టైల్ లో పెట్టాడు. ఆర్పీది నెల్లూరు. నెల్లూరు లో చేపల పులుసు ఫేమస్ అని మనకి తెలిసిందే. అక్కడి చేపల పులుసుని ఇక్కడి వాళ్ళకి అదే టేస్ట్ తో అందచేయాలని కూకట్ పల్లిలో ఈ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు. కిరాక్ ఆర్పీ కూడా నెల్లూరు చేపల పులుసు బాగా వండుతాడు.

Asian Tarakarama Theater : సీనియర్ ఎన్టీఆర్ థియేటర్.. త్వరలో రీ ఓపెనింగ్.. ఎక్కడో తెలుసా??

ఇటీవలే ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ అనే పేరు మీద ఈ కర్రీ పాయింట్ ఓపెన్ చేశాడు కిరాక్ ఆర్పీ. ప్రముఖ నట శిక్షకుడు సత్యానంద్ దీనిని ఓపెన్ చేశారు. ఈ కర్రీ పాయింట్ లో అన్ని చోట్ల దొరికే కర్రీలతో పాటు చేపల ఐటమ్స్ చాలా స్పెషల్స్. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ నెల్లూరు నుంచి తెప్పించిన చేపలతో కట్టెలపొయ్యి మీదనే వండుతారట. ఈ రెస్టారెంట్ బాగా క్లిక్ అయితే హైదరాబాద్ లోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్స్‌ 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానని తెలిపాడు కిరాక్ ఆర్పీ.