Anasuya – Rocking Rakesh : వీడు నా తమ్ముడు.. అనసూయ మాటలకు స్టేజిపై ఏడ్చేసిన జబర్దస్త్ రాకింగ్ రాకేష్..
KCR ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ..

Jabardasth Rocking Rakesh got Emotional for Anasuya Comments in KCR Trailer Launch Event
Anasuya – Rocking Rakesh : జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ హీరోగా, నిర్మాతగా KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమా తీసాడు. తాజాగా నేడు KCR సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంటుకి అనసూయ కూడా ఓ గెస్ట్ గా వచ్చింది.
KCR ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అనసూయ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి వీడు మనదక్కా, సినిమా నేను తీస్తున్నాను అని చెప్పాడు. నాకు ఇద్దరు చెల్లెల్లు కానీ వీడు నాకు తమ్ముడు. అందరూ అతి వినయం అంటారు కానీ నిజంగానే వీడు అలాగే ఉంటాడు. నాకు వీడు హీరో అని చెప్పలేదు. 16 ఏళ్ళ కుర్రోడు అని కథ చెప్పాడు. అందరూ డబ్బులు ఎక్కువ వస్తే ఇల్లు, స్థలాలు కొనుకుంటారు. కానీ రాకేష్ సినిమా తీసాడు. సినిమా కోసం ఇక్కడే ఉన్నాడు. ఈ సినిమా బలగం కంటే పెద్ద హిట్ అవుతుంది అని తెలిపింది.
Also Read : KCR Movie : రాకింగ్ రాకేష్ KCR సినిమా ట్రైలర్ రిలీజ్.. ఎమోషన్ తో అదరగొట్టారుగా..
దీంతో అనసూయ తమ్ముడు అంటూ రాకేష్ ని దగ్గరికి తీసుకొని మాట్లాడటంతో రాకేష్ ఎమోషనల్ అయి స్టేజిపై ఏడ్చేశాడు. అలాగే సినిమా గురించి, సినిమాలో నటించిన వ్యక్తుల గురించి అనసూయ మాట్లాడింది.