Yamudu : ‘యముడు’ టీజర్ చూశారా? క్రైమ్ థ్రిల్లర్..
మీరు కూడా యముడు టీజర్ చూసేయండి..

Jagadeesh Amanchi Yamudu Teaser Released
Yamudu : జగన్నాధ పిక్చర్స్ బ్యానర్ పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘యముడు’. ధర్మో రక్షతి రక్షితః అనేది ఉప శీర్షిక. ఈ సినిమాలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాగా యముడు తెరకెక్కుతుంది.
ఇప్పటికే యముడు సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ చేయగా తాజాగా యముడు టీజర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ టీజర్ నవీన్ చంద్ర చేతుల మీదుగా రిలీజ్ చేశారు. మీరు కూడా యముడు టీజర్ చూసేయండి..
టీజర్ చూస్తుంటే సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టు చూపించారు. ‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అని హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా జూన్ 13న రిలీజ్ కానుంది.
Also Read : Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..