TDP Mahanadu : టీడీపీకి భారీ విరాళం ఇచ్చిన టాలీవుడ్ నిర్మాత.. స్వయంగా ప్రకటించిన చంద్రబాబు.. ఎంతిచ్చారో తెలుసా?
టాలీవుడ్ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ భారీ విరాళం ఇచ్చినట్టు తెలిసింది.

Producer Nagavamsi Donated Huge Amount to TDP Party CM Chandrababu Naidu Anouunce in Mahanadu
TDP Mahanadu : ప్రస్తుతం ఏపీలో టీడీపీ మహానాడు ఘనంగా జరుగుతుంది. గత రెండు రోజుల నుంచి కడపలో జరుగుతున్న మహానాడు నేడు ఆఖరు రోజు. నేడు మహానాడు సభకు దాదాపు 5 లక్షలమందికి పైగా కార్యకర్తలు, టీడీపీ అభిమానులు హాజరయ్యారు. మహానాడులో టీడీపీకి భారీ విరాళాలు ఇచ్చిన వారి పేర్లను స్వయంగా చంద్రబాబు చదివి వినిపించారు.
Also Read : Sarkaar : ‘సర్కార్’ మళ్ళీ వచ్చేస్తున్నాడు.. మరోసారి సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్మెంట్..
ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి సితార ఎంటర్టైన్మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ భారీ విరాళం ఇచ్చినట్టు తెలిసింది. చంద్రబాబు స్వయంగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు 25 లక్షల రూపాయలు టీడీపీకి విరాళం ఇచ్చినట్టు ప్రకటించారు. మొత్తం ఈ సంవత్సరం 22 కోట్ల 28 లక్షల రూపాయలు విరాళాలు పార్టీకి వచ్చాయని తెలిపారు. నిర్మాత నాగవంశీ 25 లక్షలు విరాళం ఇచ్చారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఆయన్ని అభినందిస్తున్నారు.
THANK YOU @vamsi84 Anna For Donating 25 Lakhs To The Telugu Desam Party 💛#Mahanadu #NagaVamsi pic.twitter.com/nD384M6kVg
— CBN FOR BETTER NATION (@ncbnclut) May 27, 2025