Jagapathi Babu : మందు ఫుల్ గా తాగా.. సిగరెట్ మాత్రం తాగొద్దు.. ఆ విషయంలో బాధపడ్డా.. జగపతి బాబు కామెంట్స్ వైరల్..
ఓ ఇంటర్వ్యూలో తన ఆల్కహాల్, సిగరెట్ అలవాట్ల గురించి మాట్లాడాడు. (Jagapathi Babu)
Jagapathi Babu
Jagapathi Babu : నటుడు జగపతి బాబు త్వరలో వదలా అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఆల్కహాల్, సిగరెట్ అలవాట్ల గురించి మాట్లాడాడు.
Also Read : Jagapathi Babu : ఆ సినిమా చేసినందుకు కాకినాడ నుంచి ఫోన్ చేసి మరీ తిట్టాడు.. జగపతి బాబుని తిట్టిన అభిమాని..
జగపతి బాబు మాట్లాడుతూ.. నేను మందు చాలా తాగాను. ఒకప్పుడు ట్యాంకర్లు ట్యాంకర్లు తాగేసాను. కానీ ఇప్పుడు ఆల్కహాల్ తాగడం ఆపేసాను. సిగరెట్ మాత్రం వదల్లేకపోతున్నాను. అంతఃపురం సినిమాలో నేను సిగరెట్ ఎక్కువగా తాగే పాత్ర చేశా. అది చూసి అప్పట్లో చాలా మంది కుర్రాళ్ళు సిగరెట్ తాగడం మొదలుపెట్టారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ విషయంలో బాధపడ్డా.
నేను ఒకటే చెప్తున్నా సిగరెట్ మాత్రం తాగొద్దు. ఒకవేళ మొదలుపెట్టకపోతే అసలు మొదలుపెట్టకండి సిగరెట్. నేను మానేద్దాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు.ట్రై చేస్తున్నాను సిగరెట్ మానెయ్యడానికి. అది చాలా వరస్ట్ అడిక్షన్. అది ఒక రాక్షసి లాంటిది అని అన్నారు.
