Jai HanuMan : ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్.. హనుమంతుడిగా చిరంజీవి..? రానా దగ్గుబాటి..?

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 'జై హనుమాన్' ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ వర్మ. ఇక ఈ మూవీలో హనుమంతుడిగా..

Jai HanuMan : ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్.. హనుమంతుడిగా చిరంజీవి..? రానా దగ్గుబాటి..?

Jai HanuMan pre production work starts hero will be Chiranjeevi or rana daggubati rumour viral

Updated On : January 22, 2024 / 9:08 PM IST

Jai HanuMan : ఇండియన్ దేవుళ్ళని సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ.. దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో ఒక సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశారు. అంతేకాదు ఆ సినిమా ఎండింగ్ లోనే సీక్వెల్ ని కూడా ప్రకటించేశారు. ఇక హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఆడియన్స్ అంతా ‘జై హనుమాన్’ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో..? అని ప్రశ్నలు వేస్తున్నారు.

ఇక నేడు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కావడంతో.. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా రామనామ జపం జరుగుతుంది. దీంతో ఈ బ్రహ్మాండమైన రోజునే ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీ పనులు కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ని.. ఈ మహత్తకర రోజునే ప్రారంభిస్తున్నాము అంటూ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ఇక ఈ అనౌన్స్‌మెంట్ తో హనుమాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Also read : HanuMan : ‘హనుమాన్’ విజువల్ ఎఫెక్ట్స్ మాంత్రికుడు ఎవరో తెలుసా..?

కాగా ఈ మూవీ కథ అంతా హనుమాన్ పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు. ఇక ఈ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోని తీసుకోబోతున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ కారణంతోనే మొదటి పార్ట్ లో హనుమంతుడి ఫేస్ ని రివీల్ చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అన్నది మాత్రం తెలియజేయలేదు. అయితే ఇటీవల ఈ సినిమాలో రామ్ చరణ్.. రాముడి పాత్రలో కనిపించబోతున్నారంటూ గట్టిగా వార్తలు వినిపించాయి.

మరో విషయం ఎంటంటే.. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హనుమంతుడి కళ్ళు చూసి చిరంజీవి అని భావించారు. కానీ సినిమాలో ఫేస్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేశారు. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కళ్ళు చూసి చిరంజీవి, ఫేస్ సైడ్ కట్ అవుట్ చూసి రానా దగ్గుబాటి అంటున్నారు. మరి వీరిలో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారో చూడాలి. కాగా ఈ సీక్వెల్ లో తేజ సజ్జ హనుమంతు పాత్రతోనే సపోర్టింగ్ రోల్ లో కనిపిస్తాడని తెలియజేశారు. ఈ సీక్వెల్ 2025 లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.