Jai Jawan : స్వాతంత్ర దినోత్సవం రోజున.. ‘జై జవాన్’ ట్రైలర్ రిలీజ్..
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇండిపెండెన్స్ డే రోజు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు.

Jai Jawan Trailer Released on Independence Day
Jai Jawan Trailer : సంతోష్ కల్వచెర్ల, పావని రామిశెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా జై జవాన్. కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై సందిరెడ్డి శ్రీనివాసరావు, పోసం మధుసూదన్ రెడ్డి, పోటు వెంకటేశ్వర్లు నిర్మాణంలో నాగబాబు పోటు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తనికెళ్ల భరణి, సత్యప్రకాష్, నాగినీడు, బలగం సంజయ్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
దేశభక్తి నేపథ్యంలో దేశ సరిహద్దులో కాపలాగా ఉండే సైనికుడి గొప్పదనాన్ని తెలిపే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఇండిపెండెన్స్ డే రోజు డైరెక్టర్ గోపీచంద్ మలినేని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో.. ఒక సైనికుడు దేశ సరిహద్దుల్లో ఉంటే, ఇక్కడ అతని కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడుతుంది. ఆర్మీ వాళ్ళను ఇక్కడ జనాలు ఎలా చూస్తున్నారు అనే కథాంశంతో సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. తనికెళ్ళ భరణి, సాయి కుమార్ వాయిస్ తో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ చూసేయండి..
ఇక ట్రైలర్ లాంచ్ అనంతరం గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన గొప్ప సినిమాలా ఉండబోతుందని తెలుస్తుంది. ఇలాంటి ఇండిపెండెట్ సినిమా విజయం సాధించాలి అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో సైనికుడి గొప్పతనం తెలిసేలా సినిమా చేసాం. సంతోష్ కల్వచెర్ల హీరోగా ఈ సినిమా తర్వాత మంచి భవిష్యత్ ఉంటుంది. మా సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించిన గోపీచంద్ మలినేని గారికి ధన్యవాదాలు అని అన్నారు.