Jailer OTT : జైల‌ర్ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) న‌టించిన‌ సినిమా ‘జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది.

Jailer OTT : జైల‌ర్ ఓటీటీ పార్ట్‌న‌ర్ ఫిక్స్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Jailer OTT Release

Updated On : August 10, 2023 / 9:41 PM IST

Jailer OTT Release : సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ (Rajinikanth) న‌టించిన‌ సినిమా ‘జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ఈ చిత్రంలో త‌మ‌న్నా (Tamannaah), కన్నడ న‌టుడు శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohanlal), రమ్య కృష్ణ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నేడు (ఆగ‌స్టు 10 గురువారం) ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వింటేజ్ ర‌జనీకాంత్ క‌నిపించాడ‌ని సినిమా చూసిన వారు చెబుతుండ‌గా.. ర‌జనీ ఈజ్ బ్యాక్ అంటూ అత‌డి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మొద‌టి రోజే ఈ చిత్రం రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు సినీ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

Jailer : ‘జైల‌ర్‌’పై నెగిటివ్ రివ్యూ.. ఇద్ద‌రిని చిత‌క్కొట్టిన ర‌జనీకాంత్ అభిమానులు..

ఇక ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను స‌న్‌నెక్ట్స్‌ ద‌క్కించుకుంది. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ దాదాపు 200కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌గా త‌మ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన స‌న్‌నెక్ట్స్ ద్వారానే రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. థియేట‌ర్‌లో విడుద‌లైన ఆరు వారాల త‌రువాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. అంటే ఈ లెక్క‌న సెప్టెంబ‌ర్ చివ‌రి వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్న‌ట్లుగా చెబుతున్నారు.

Bhola Shankar: భోళా శంకర్ సినిమా విడుదలకు లైన్ క్లియర్.. సంబరాలకు మెగా ఫ్యాన్స్ రెడీ

ఇక జైల‌ర్ సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. టైగర్ ముత్తువేల్ పాండియన్(రజనీకాంత్) ఓ రిటైర్డ్ జైలర్. ఉద్యోగ విర‌మ‌ణ త‌రువాత త‌న కుటుంబంతో క‌లిసి హాయిగా జీవిస్తుంటాడు. అత‌డి కొడుకు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ). నిజాయతీ క‌లిగిన అధికారి. ఇత‌డిని విగ్రహాలు చోరీ చేసే ముఠా కిడ్నాప్ చేస్తుంది. కొన్నాళ్లుగా క‌నిపించ‌కుండా పోయిన త‌న కొడుకు ఆచూకీ తెలుసుకునేందుకు ముత్తు రంగంలోకి దిగుతాడు. మ‌రీ అత‌డు త‌న కొడుకుని ర‌క్షించుకున్నాడా..? ఆ విగ్ర‌హాల స్మ‌గ్లింగ్ చేసే ముఠా ఆట క‌ట్టించాడా..? ఏం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Renu Desai : ప‌వ‌న్ అరుదైన వ్య‌క్తి.. నా మ‌ద్ద‌తు ఆయ‌నకే.. 11 ఏళ్ల నుంచి దూరంగానే ఉన్నాం.. పిల్ల‌ల‌ను రాజ‌కీయాల్లోకి లాగొద్దు