జేమ్స్‌‌బాండ్ నటుడు సీన్ కానరీ ఇకలేరు

  • Published By: sekhar ,Published On : October 31, 2020 / 06:42 PM IST
జేమ్స్‌‌బాండ్ నటుడు సీన్ కానరీ ఇకలేరు

Updated On : October 31, 2020 / 7:33 PM IST

James Bond – Sean Connery: జేమ్స్‌బాండ్ మూవీస్ తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసిన పాపులర్ హాలీవుడ్ నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. మొట్టమొదటి హాలీవుడ్ జేమ్స్‌బాండ్ సీన్ కానరీనే. జేమ్స్‌బాండ్ 007గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు సీన్ కానరీ.



ఆయన మొత్తం ఏడు బాండ్ సినిమాల్లో నటించారు. Dr. No, From Russia with Love, Goldfinger, Thunderball, You Only Live Twice, Diamonds Are Forever, Never Say Never Again వంటి బాండ్ సిరీస్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు సీన్ కానరీ.


‘ది అన్ టచబుల్స్’ సినిమాలో నటనకుగాను ఉత్తమ సహాయనటుడు (సపోర్టింగ్ యాక్టర్)గా ఆస్కార్ గెలుచుకున్నారాయన. అలాగే 1999లో పీపుల్స్ మ్యాగజైన్ ‘సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీ’ గానూ ఎంపికయ్యారు.

DR. NO | Bond, James Bond. - YouTube