అవతార్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో పిల్లలు, పెద్దలందరినీ ఆకట్టుకున్న అవతార్ సినిమా ఏ రేంజ్లో రికార్డులు కొల్లగొట్టిందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అవతార్ సినిమా సీక్వెల్స్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా అవతార్ 2, 3, 4, 5 సీక్వెల్స్ ను తెరకెక్కించనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ నాలుగు సీక్వెల్స్ లా రిలీజ్ డేట్ల ను కూడా ముందే ప్రకటించారు.
ఇటీవల అవతార్ ఫ్యామిలీలోకి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఆస్ట్రేలియన్ యాక్టర్ బ్రెండెన్ కోవెల్‌ను తీసుకున్నారు. రచయితగా, దర్శ కుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రెండెన్ అవతార్ ఫ్యామిలీలోకి ఎంటర్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయన పండోరా గ్రహంలో కెప్టెన్ మిక్ స్కార్స్‌బీ పాత్రలో కనిపిస్తారు.
అయితే గత కొంత కాలంగా అవతార్ 2 చిత్రం డిసెంబర్ 18, 2020న రిలీజ్ చేద్దామనుకున్నారు. కాని తాజాగా చిత్రాన్ని డిసెంబర్ 17, 2021న విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. మరి మిగతా పార్ట్‌లని ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
Busy on set, so no time to hang around but just dropping in to share the news — Sivako! @OfficialAvatar https://t.co/KpCzxmBPMd
— James Cameron (@JimCameron) May 7, 2019