వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వేణు మాధవ్ మృతికి సంతాపం తెలుపుతూ.. లేఖ విడుదల చేశారు..

ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వేణు మాధవ్ మృతికి సంతాపం తెలుపుతూ.. లేఖ విడుదల చేశారు..
ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వేణు మాధవ్ మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వేణు మాధవ్ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలీ, శివాజీ రాజా, ఉత్తేజ్, సి.కళ్యాణ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వేణు మాధవ్ మృతి పట్ల సంతాపం తెలియచేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. వేణు మాధవ్ మృతికి సంతాపం తెలుపుతూ..లేఖ విడుదల చేశారు.
Read Also : RIP : బతికుండగానే చావు వార్తలు చదువుకున్న వేణుమాధవ్..
‘అందరినీ నవ్వించిన వేణు మాధవ్ ఇకలేరు అనే విషయం దిగ్భ్రాంతికి లోనుచేసింది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. గోకులంలో సీత నుండి నాతో పలు సినిమాల్లో నటించారు. హాస్యం పండిచడంలో మంచి టైమింగ్ ఉన్న నటుడు.. మిమిక్రీలో కూడా నైపుణ్యం ఉండడంతో సెట్లో అందరినీ సరదాగా ఉంచేవారు. రాజకీయ విషయాలపై ఆసక్తి చూపేవారు. వేణు మాధవ్ మృతికి నా తరపున, జనసైనికుల తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.. వేణు మాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను’.. అంటూ వేణు మాధవ్ మృతికి సంతాపం తెలిపారు పవన్ కళ్యాణ్.