Janhvi – Kushi Kapoor : అక్క తెలుగు, చెల్లి తమిళ ఎంట్రీ.. శ్రీదేవి కూతుళ్లు సౌత్‌ని ఏలుతారా?
శ్రీదేవి వారసురాలుగా జాన్వీ కపూర్ ఆల్రెడీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి రెండో కూతురు జాన్వీ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అక్కాచెల్లెళ్లు ఇప్పుడు సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Janhvi Kapoor and Kushi Kapoor entry into South Movies
Janhvi – Kushi Kapoor : అందాల తార, దివంగత నటి శ్రీదేవి తన సినిమాలతో దాదాపు కొన్ని దశాబ్దాలపాటు సౌత్, బాలీవుడ్ సినిమాలను ఏలింది. ఆమె వారసురాలుగా జాన్వీ కపూర్ ఆల్రెడీ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ కూడా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. అయితే అక్కాచెల్లెళ్లు ఇప్పుడు సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
శ్రీదేవి(Sridevi) పెద్ద కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) బాలీవుడ్ లో ‘దఢక్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటూ వస్తుంది. అయితే జాన్వీకి ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేకపోవడంతో ఇంకా స్టార్ హీరోయిన్ కాలేదని చెప్పొచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దేవర సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న జాన్వీ ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాధించి మరిన్ని కమర్షియల్ సినిమాలు చేయాలని చూస్తుంది.
ఇక శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్(Kushi Kapoor) ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. త్వరలో బాలీవుడ్ లో ‘ది ఆర్చీస్’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా ఖుషి కపూర్ తమిళ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ నటుడు అధర్వ రాబోయే సినిమాలో ఖుషి కపూర్ నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read : ఒక్క స్పీచ్ లో బోలెడన్ని విషయాలు చెప్పిన విశ్వక్‌సేన్.. డేట్లు లేక ఆ హిట్ సినిమాలు వదిలేసుకోని..
ఒకవేళ ఖుషి కపూర్ నిజంగానే తమిళ సినిమాతో ఎంట్రీ ఇస్తే, అక్క జాన్వీతో పాటే సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే. శ్రీదేవికి తమిళ్, తెలుగులోనే ఎక్కువ పేరు వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మరి తల్లి లాగే ఈ అక్కాచెల్లెళ్లు సౌత్ లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అవుతారా చూడాలి.
#Kapoor Sisters #JanhviKapoor #KushiKapoor pic.twitter.com/myZ29fJtA9
— FilmyBliss (@Filmybliss12) November 10, 2023