Koffee with Karan : మాజీ ముఖ్యమంత్రి మనవళ్లు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన జాన్వీ, సారా..

సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో డేటింగ్‌ చేసినట్లు కరణ్‌ జోహార్ చెప్పేయడంతో 'ఇంత ఓపెన్‌గా ఆ విషయం షోలో చెప్పేస్తావా?' అని ఇద్దరూ షాక్ అయ్యారు. వీరిద్దరూ ఆ డేటింగ్ గురించి...........

Koffee with Karan : మాజీ ముఖ్యమంత్రి మనవళ్లు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన జాన్వీ, సారా..

Janhvi Kapoor

Updated On : July 16, 2022 / 7:23 AM IST

Koffee with Karan :  బాలీవుడ్ స్టార్ షో కాఫీ విత్ కరణ్ జోహార్ ఏడో సీజన్ డిస్నిప్లస్ హాట్‌స్టార్‌ లో టెలికాస్ట్ అవుతుంది. ఇటీవలే మొదలైన ఈ షోలో సెకండ్ ఎపిసోడ్ కి బాలీవుడ్ స్టార్ కిడ్స్ సారా అలీఖాన్‌, జాన్వీ కపూర్‌లు గెస్టులుగా వచ్చారు. వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా. తాజాగా టెలికాస్ట్ అయిన ఈ ఎపిసోడ్ లో వీరిద్దరూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. వీరిద్దరూ విజయ్ దేవరకొండ తో డేటింగ్ చేయాలని ఉందని అనడంతో వైరల్ గా మారింది ఈ ఎపిసోడ్. అలాగే వీరి పాత డేటింగ్స్ గురించి కూడా మాట్లాడారు.

సారా అలీ ఖాన్‌, జాన్వీ కపూర్ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములతో డేటింగ్‌ చేసినట్లు కరణ్‌ జోహార్ చెప్పేయడంతో ‘ఇంత ఓపెన్‌గా ఆ విషయం షోలో చెప్పేస్తావా?’ అని ఇద్దరూ షాక్ అయ్యారు. వీరిద్దరూ ఆ డేటింగ్ గురించి తెలిపారు. ఆ బ్రదర్స్‌ ఇద్దరూ సారా, జాన్వీ పొరుగింట్లో ఉండటంతో లాక్‌డౌన్‌ సమయంలో స్నేహం చేసినట్లు తెలిపారు. దీంతో ఆ బ్రదర్స్ ఎవరా అని నెటిజన్లు ఆరా తీశారు.

Sudarshan : సినిమాల్లేవా.. అందుకే వెబ్ సిరీస్ చేస్తున్నావా అని అడగడంతో.. సీరియస్ అయిన హీరో సుశాంత్

ఇక ఈ ఎపిసోడ్ వచ్చాక సారా, జాన్వీతో డేటింగ్‌ చేసిన ఆ అన్నదమ్ములు వీళ్ళే అంటూ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళు డేటింగ్‌ చేసిన బ్రదర్స్‌ వీర్‌ పహారియా, శిఖర్‌ పహారియా. వీళ్ళు ఇద్దరూ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే మనవళ్లు. దీంతో వీరిద్దరూ జాన్వీ, సారాలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తలపై ఆ అన్నదమ్ములు స్పందిస్తారేమో చూడాలి. ప్రస్తుతం అయితే వారితో డేటింగ్ చేయట్లేదని చెప్పారు. మొత్తానికి ఇద్దరు హీరోయిన్స్ అన్నదమ్ములతో డేటింగ్ చేశారు అనడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.