Janhvi Kapoor: ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ బాలీవుడ్ కంటే ఎక్కువే తీసుకుంటోందిగా..?

అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన NTR30 మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు ఆమె భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Janhvi Kapoor: ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ బాలీవుడ్ కంటే ఎక్కువే తీసుకుంటోందిగా..?

Janhvi Kapoor Remuneration Higher Than Bollywood For NTR30

Updated On : April 25, 2023 / 12:36 PM IST

Janhvi Kapoor: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. తన కెరీర్‌లో 30వ మూవీగా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, ఈసినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో మరోసారి ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ సరసన అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

Janhvi Kapoor : అతడితో జాన్వీ ప్రేమాయణం నిజమేనా.. తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న ఇద్దరు..

అయితే, తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న జాన్వీ కపూర్ ఈ చిత్రానికి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. NTR30 మూవీ కోసం జాన్వీ ఏకంగా రూ.5 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోనుందట. ఓ బాలీవుడ్ బ్యూటీ ఇంత భారీ రెమ్యునరేషన్‌తో సౌత్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం కేవలం జాన్వీకే సాధ్యమయ్యిందని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో జాన్వీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే ఇది చాలా ఎక్కువ అని తెలుస్తోంది.

Janhvi Kapoor : ఎన్టీఆర్ కోసమే RRR మళ్ళీ చూశాను.. ఆయనతో సినిమా ఛాన్స్ కోసం రోజూ దేవుడికి దండం పెట్టుకున్నాను..

సౌత్‌లో ఎంట్రీతోనే జాన్వీ ఈరేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇక ఈ సినిమాలో ఆమె పాత్రను కొరటాల చాలా పవర్‌ఫుల్‌గా రాసుకున్నాడట. ఈ సినిమాతో జాన్వీకి సౌత్‌లో అదిరిపోయే ఎంట్రీ అవుతుందని.. ఆమెకు ఇక్కడ తిరుగులేకుండా పోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇక ఎన్టీఆర్ 30వ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.