Janhvi Kapoor : సింపుల్ లుక్లో జాన్వీ కపూర్.. కానీ రెండున్నర కోట్ల వాచ్.. స్పెషల్ ఏంటి..? ఎందుకంత కాస్ట్..?
ప్రస్తుతం జాన్వీ కపూర్ తన అక్క అన్షులా కపూర్ పెళ్లి హడావిడిలో ఉంది.(Janhvi Kapoor)
Janhvi Kapoor
Janhvi Kapoor : జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టాలీవుడ్ ని కూడా పలకరిస్తుంది. ఇటీవల జాన్వీ పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ తన అక్క అన్షులా కపూర్ పెళ్లి హడావిడిలో ఉంది. ఇటీవల ఈ పెళ్లి వేడుకల్లో సింపుల్ డ్రెస్ లో కనిపించింది జాన్వీ. అయితే డ్రెస్ సింపుల్ గా వేసుకొచ్చినా ఖరీదైన వాచ్ పెట్టుకుంది.
దీంతో జాన్వీ కపూర్ వాచ్ వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ పెట్టుకున్న వాచ్ అంతర్జాతీయ బ్రాండ్ పాటెక్ ఫిలిప్ కు చెందింది. ఆ కంపెనీకి చెందిన ‘గోండోలో హాట్ క్లేర్ పెర్ల్’ అనే మోడల్ లో ఉన్న రోజ్ గోల్డ్ కలర్ వాచ్ ని జాన్వీ పెట్టుకుంది. ఈ లగ్జరీ వాచ్ ధర దాదాపు రెండు నుంచి రెండున్నర కోట్లు ఉంది. దేశాన్ని బట్టి ఆ వాచ్ ధర మారుతుంది.
Also Read : Gehna Sippy : ఫుట్ బాల్ ఫీవర్.. అర్జెంటీనా జెర్సీతో హీరోయిన్ గెహనా సిప్పి క్యూట్ ఫొటోలు..
గోల్డెన్ స్పూన్ తో పుట్టిన జాన్వీకి ఈ వాచ్ కొనడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఈ వాచ్ ఎందుకు ఇంత కాస్ట్ అని అంతా ఆరా తీస్తున్నారు. ఈ వాచ్ అంత భారీ ఖరీదు ఉండటానికి కారణం అందులో వాడిన వజ్రాలు, ముత్యాలేనట. ఈ వాచ్ తయారీలో దాదాపు 250 చిన్ని చిన్న వజ్రాలు, 70 కి పైగా ఖరీదైన ముత్యాలు, అంతే కాకుండా 18 క్యారెట్ల గోల్డ్ డయల్ ప్లేట్ తో ఈ వాచ్ ని తయారుచేసారు. అందుకే ఈ వాచ్ అంత కాస్ట్.
