Sandeep Reddy Vanga : నన్ను ఏం అనలేక నా కొడుకుని అంటున్నావు.. సందీప్ వంగపై మరోసారి జావేద్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా మళ్ళీ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై, సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసాడు.

Javed Akhtar counter to Sandeep Reddy Vanga Comments
Sandeep Reddy Vanga : డైరెక్టర్ సందీప్ వంగ ఇటీవల యానిమల్(Animal) సినిమాతో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొదట్నుంచి కూడా సందీప్ వంగ సినిమాల్లో బోల్డ్ సీన్స్, వైలెన్స్ ఎక్కువే ఉంటాయి. యానిమల్ సినిమా చూసాకా చాలామంది ఈ సినిమాపై విమర్శలు కూడా చేసారు. సందీప్ వంగ కొంతమందికి కౌంటర్ ఇస్తూ సమాధానాలు కూడా చెప్పాడు.
ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ రచయిత జావేద్ అక్తర్(Javed Akhtar).. యానిమల్ లాంటి సినిమాలు హిట్ అయితే సమాజానికి ప్రమాదకరం అంటూ సినిమాని విమర్శిస్తూ వ్యాఖ్యలు చేశారు. వీటికి సందీప్ వంగ కౌంటర్ ఇస్తూ.. సినిమా చూడకుండా ఇలా కామెంట్స్ చేసేవాళ్ళ గురించి ఏం మాట్లాడతాం. ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు తమ చుట్టుపక్కల పట్టించుకోరేమో. జావేద్ కొడుకు ఫర్హాన్ అక్తర్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ ఉన్నాయి. తెలుగులో అయితే అసలు ఆ సిరీస్ చూడలేకపోయాము. మరి తన కొడుక్కి ఎందుకు చెప్పలేదు? తన కొడుకుని ఎందుకు ఇలా విమర్శించలేదు అని కౌంటర్ ఇచ్చాడు. ఇది జరిగి ఆల్రెడీ నెలపైనే అయింది.
Also Read : Director Teja : అది నేను కనిపెట్టాకే సినీ పరిశ్రమలో అందరూ వాడుతున్నారు… తేజ ఆసక్తికర వ్యాఖ్యలు..
కానీ తాజాగా మళ్ళీ జావేద్ అక్తర్ యానిమల్ సినిమాపై, సందీప్ వ్యాఖ్యలపై కామెంట్స్ చేసాడు. జావేద్ అక్తర్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఆ సినిమాని, డైరెక్టర్ ని ఏమి అనలేదు. అలాంటి సినిమాలు చూసే ప్రేక్షకుల గురించే నా ఆందోళన. ఎవరు ఎలాంటి సినిమా అయినా తీసుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. అయినా నేను సినిమా చూడలేదు. కొన్ని సీన్స్ చూసే ఆ కామెంట్స్ చేశాను. నా వ్యాఖ్యలకు సందీప్ స్పందించడం గౌరవంగా అనిపించింది. ఎందుకంటే నా 53 ఏళ్ళ కెరీర్ లో నేను రాసిన సినిమాలు, స్క్రిప్ట్స్, డైలాగ్స్, పాటల్లో ఎక్కడా ఒక్క అసభ్యతని కూడా సందీప్ చూపించలేకపోయాడు. ఇక నన్నేమి అనలేక నా కుమారుడి మీద పడ్డాడు. అది కూడా తన ఆఫీస్ నిర్మించిన సిరీస్ పై. నా దాంట్లో తప్పులు వెతకలేక నా కుమారుడిని కామెంట్ చేసాడు సందీప్ అని వ్యాఖ్యలు చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. మరి వీటిపై సందీప్ వంగ మళ్ళీ కౌంటర్ ఇస్తాడేమో చూడాలి.