Jayam Ravi – Aarti : వామ్మో హీరో నుంచి ప్రతి నెలా అన్ని లక్షల భరణం కోరిన భార్య.. ఫ్యాన్స్, నెటిజన్ల విమర్శలు..
తాజాగా విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు.

Jayam Ravi and Aarti Attends to Family Court in Chennai Aarti Requested Alimony
Jayam Ravi – Aarti : తమిళ్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి రవి విడాకుల విషయం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జయం రవి తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే, ఆర్తి రవి మాత్రం నాకు తెలియకుండానే ప్రకటించారు అని రవిపై ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో జయం రవి ఓ సింగర్ కెనిషాతో ప్రేమలో ఉన్నాడని వార్తలు రావడంతో ఆర్తి జయం రవిని విమర్శిస్తూ ఫ్యామిలీని, పిల్లల్ని పట్టించుకోలేదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.
దానికి జయం రవి కౌంటర్ ఇస్తూ ఇన్నేళ్ళుగా నా డబ్బులు వాడుకున్నారని, నా పిల్లల్ని కలవనివ్వట్లేదని, వాళ్ళ ఫ్యామిలీ కూడా నా డబ్బులు వాడుకుంది అని తీవ్ర విమర్శలు చేస్తూ నా పిల్లలను దూరం చేయకు అంటూ భార్యపై కూడా ఆరోపణలు చేసాడు. ఇలా సోషల్ మీడియాలో ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసారు. వీరి విడాకుల కేసు మాత్రం కోర్టులో నడుస్తుంది. రవి ఇకపై కోర్టులోనే మాట్లాడతాను ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సింపతీ తెచ్చుకొను అని భార్యపై కౌంటర్లు వేసాడు. ఆర్తి మాత్రం ఏదో ఒక పోస్ట్ పెడుతూ వైరల్ అవుతుంది.
Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఫ్యాన్స్ గెట్ రెడీ..
తాజాగా విడాకుల కేసుకు సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ అనంతరం కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోర్టు సూచించింది. అయితే ఇంత జరిగాక ఆర్తితో పెళ్లి బంధాన్ని కొనసాగించలేనని జయం రవి స్పష్టం చేసి విడాకులు ఇప్పించాలని అతని లాయర్లు తో చెప్పించాడు. జయం రవి ఇలా విడాకులు స్పష్టంగా కోరడంతో అతని నుంచి నెలకు 40 లక్షల రూపాయల భరణం ఇప్పించాలని ఆర్తి కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.
దీంతో ఈ వార్త వైరల్ గా మారగా పలువురు ఆర్తిని విమర్శిస్తున్నారు. జయం రవి డబ్బుల కోసమే ఆర్తి, ఆమె తల్లితండ్రులు ఇన్నాళ్లు తనని వాడుకున్నారని చెప్పడం, ఇప్పుడు ఆర్తి కూడా ఏకంగా 40 లక్షలు నెలకు అడగడంతో డబ్బులు కోసమే ఆర్తి ఇదంతా చేస్తుందా అని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లు విడాకులు వద్దు భర్త కావాలన్న ఆర్తి ఇప్పుడు నెలకు 40 లక్షలు భరణం కావాలని పిటిషన్ వేయడంతో ఆమెపై మరింత ఫైర్ అవుతున్నారు.
ఇక ఆర్తి తండ్రి పెద్ద బిజినెస్ మెన్. వాళ్ళ అమ్మ నిర్మాత. ఆర్తి కి కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఇవన్నీ ఉంచుకొని కూడా ఇంత భారీ భరణం, అది కూడా ప్రతినెలా అడగడంతో ఆర్తిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నెలకు 40 లక్షలు అంటే జయం రవి ఎక్కడ్నుంచి తెచ్చిస్తాడు అని కూడా పలువురు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అతను సంవత్సరానికి రెండు సినిమాలు చేసినా ఆ డబ్బులు మొత్తం ఆర్తికే ఇవ్వాల్సి వస్తుందేమో అని పలువురు సరదాగా కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై జయం రవి ఏమని స్పందిస్తాడో చూడాలి. మొత్తానికి జయం రవి – ఆర్తి విడాకులు రోజూ వార్తల్లో నిలుస్తున్నాయి.