Jigarthanda Doublex : తమిళ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ అనౌన్స్.. హరీష్ శంకర్ రీమేక్ చేస్తాడా?
తమిళ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా 2014లో విడుదలైన సినిమా 'జిగర్‌తండా'. హీరో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 2015 జాతీయ అవార్డుల పురస్కారాల్లో రెండు అవార్డులను అందుకొని, పక్క ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు చూపులు ఆ సినిమాపై పడేలా చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

Jigarthanda Doublex teaser out
Jigarthanda Doublex : తమిళ సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అంచనాలు లేకుండా 2014లో విడుదలైన సినిమా ‘జిగర్‌తండా’. హీరో సిద్దార్ధ, బాబీ సింహ, లక్ష్మి మీనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. 2015 జాతీయ అవార్డుల పురస్కారాల్లో రెండు అవార్డులను అందుకొని, పక్క ఇండస్ట్రీ దర్శకనిర్మాతలు చూపులు ఆ సినిమాపై పడేలా చేసుకుంది. ఈ క్రమంలోనే తెలుగుతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా రీమేక్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.
Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రీన్ ప్లే రైటర్ ఎవరో తెలుసా?
తెలుగులో ఈ సినిమాను హరీష్ శంకర్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో ‘గద్దలకొండ గణేష్’ అనే పేరుతో రీమేక్ చేశాడు. ఇక్కడ కూడా ఈ కథ సూపర్ హిట్టుగా నిలిచింది. అయితే తాజాగా ‘జిగర్‌తండా’ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీ సీక్వెల్ ని ప్రకటించాడు. అందుకు సంబంధించిన వీడియో టీజర్ ని నేడు విడుదల చేశాడు. ఈ సీక్వెల్ కి ‘జిగర్‌తండా డబులెక్స్’ అనే టైటిల్ ని ఖరారు చేశాడు డైరెక్టర్ కార్తీక్.
కాగా ఈ సీక్వెల్ లో మొదటి భాగంలో నటించిన నటులను కాకుండా, ‘రాఘవ లారెన్స్’ – ‘ఎస్ జే సూర్య’లను ప్రధాన పాత్రధారులుగా తీసుకున్నాడు కార్తీక్. ఇక రిలీజ్ చేసిన టీజర్ అయితే.. చాలా ఇంటెన్స్ తో మూవీపై ఇంట్రస్ట్ కలిగేలా చేస్తుంది. ముఖ్యంగా లారెన్స్ లుక్ అయితే అదుర్స్. మరి మొదటి భాగాన్ని రీమేక్ చేసి హిట్టు కొట్టిన హరీష్ శంకర్, ఈ సీక్వెల్ ని కూడా రీమేక్ చేస్తాడేమో చూడాలి.