Aghathiyaa : ‘అగత్యా’ మూవీ రివ్యూ.. భయపెడుతూనే ఆసక్తికర అంశాలు చూపించారుగా..
ఓ రకంగా భయపెట్టి ఫాంటసీ ఎలిమెంట్స్ తో మెప్పిస్తారు.

Jiiva Arjun Sarja Raashii Khanna Aghathiyaa Movie Review and Rating
Aghathiyaa Movie Review : జీవా, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన సినిమా ‘అగత్యా’. వేల్స్ బ్యానర్ పై ఇషారి కే గణేష్, అర్జున్ దేవ్ నిర్మాణంలో తమిళ గేయ రచయిత పా విజయ్ దర్శకుడిగా మారి ఈ సినిమాని తెరకెక్కించాడు. రోహిణి, అర్జున్ సర్జా, యోగిబాబు.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. అగత్యా సినిమా నేడు ఫిబ్రవరి 28న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. తమిళ సినీ పరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు అగత్య(జీవా). పూర్తిస్థాయిలో ఓ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ గా అవకాశం వస్తుంది. ఆ సినిమాకి తనే 30 లక్షలు డబ్బులు ఎదురు పెట్టి ఓ బిల్డింగ్ లో పెద్ద హారర్ సెట్ వేస్తాడు. కానీ అనుకోకుండా ఆ సినిమా క్యాన్సిల్ అవుతుంది. దీంతో ఏం చేయాలో అర్ధం కానీ అగత్యకు అతని గర్ల్ ఫ్రెండ్ (రాశిఖన్నా)ఇచ్చిన సలహాతో ఆ సెట్ ని హాంటెడ్ హౌస్ గా మారుస్తాడు. హాంటెడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే టికెట్ కొనుక్కొని చూడొచ్చు అని దాన్ని ఒక హాంటెడ్ థీమ్ పార్క్ గా మారుస్తాడు.
ఇది సక్సెస్ అయి డబ్బులు వస్తున్న సమయంలో ఆ బిల్డింగ్ లోపల ఉన్న ఓ పియానోలో ఒక మహిళ అస్తిపంజరం బయటపడుతుంది. అక్కడ ఆత్మలు ఉన్నాయని తెలుస్తుంది. దీంతో అగత్య, అతని మనుషులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. అసలు ఆ అస్థిపంజరం ఎవరిది? ఆ బిల్డింగ్ ఎవరిది? అగత్య అతని మనుషులు ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? అగత్య తల్లి కోసం ఏం చేసాడు? ఆ బిల్డింగ్ లో ఆత్మలు ఎవరివి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Guard : ‘గార్డ్’మూవీ రివ్యూ.. ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్ ఏం చేసాడు?
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ లో అగత్య సినిమా కోసం కష్టపడటం, సినిమా ఆగిపోవడం, ఆ సెట్ ని హాంటెడ్ పార్క్ లా మార్చడంతో సాగి అక్కడ ఆస్థి పంజరం బయటపడటంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఆ బిల్డింగ్ కథ, ఆత్మల కథ తో సాగుతుంది. దీంతో కథ ఫ్లాష్ బ్యాక్ కి 1940 కాలానికి తీసుకెళ్లి అప్పటి పరిస్థితులను చక్కగా చూపించారు. ఇందులో ఒక కథ అని కాకుండా దర్శకుడు చాలా పాయింట్స్ ని టచ్ చేసాడు. హారర్ థ్రిల్లర్ ప్రధానమైనప్పటికీ దేశభక్తి, సిద్దవైద్యం, మదర్ సెంటిమెంట్.. ఇలా చాలా అంశాలను టచ్ చూపించారు.
కథనం ఆసక్తిగా నడిపించినా ఇన్ని పాయింట్స్ పెట్టడంతో కాస్త క్లారిటీ మిస్ అవుతుంది. హారర్ తో భయపెడుతూనే అక్కడక్కడా నవ్వించారు. ఫ్లాష్ బ్యాక్ కి ప్రస్తుత కథకి కరెక్ట్ గా లింక్ చేసారు. ఆత్మల కథలు రొటీన్ అనిపించినా క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటుంది. ఓ రకంగా భయపెట్టి ఫాంటసీ ఎలిమెంట్స్ తో మెప్పిస్తారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అగత్యా పాత్రలో జీవా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. తన పాత్రలో బాగానే ఇమిడిపోయి నటించాడు. అర్జున్ సర్జా ఓ కొత్త పాత్రలో మెప్పించారు. రాశిఖన్నా కాసేపు మెరిపిస్తుంది. యోగిబాబు, విటివి గణేష్ కాస్త నవ్వించారు. హీరో తల్లి పాత్రలో రోహిణి ఎప్పట్లాగే అమ్మ సెంటిమెంట్ పండించింది. నెగిటివ్ షేడ్స్ లో ఫారిన్ యాక్టర్ ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్ బాగానే మెప్పించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Kiaraa Advani : గుడ్‌న్యూస్ చెప్పిన కియారా.. ‘అతి త్వరలో మా జీవితాల్లోకి విలువైన గిఫ్ట్’
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. హాంటెడ్ థీమ్ కోసం వేసిన సెట్ చాలా బాగా డిజైన్ చేసారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగానే భయపెట్టించారు. 1940 కాలానికి తగ్గట్టు విజువల్స్, లొకేషన్స్ చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తే బాగుండేది. ఇక కథ ఆసక్తిగా ఉన్నా కథనంలో చాలా పాయింట్స్ చెప్పడంతో కన్ఫ్యూజ్ కి గురవుతారు. దర్శకుడు కథనంను ఇంకాస్తా క్లారిటీగా రాసుకుంటే బాగుండేది. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.
మొత్తంగా ‘అగత్యా’ 1940లో జరిగిన సంఘటనలు ఇప్పటి కథకు కనెక్ట్ చేసి భయపెడుతూ ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.
https://www.youtube.com/watch?v=XPuUTvVrsjI
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.