Journey To Ayodhya : ‘జర్నీ టు అయోధ్య’ ప్రీ లుక్ అదిరిపోయింది..
చిత్రాలయం స్టూడియోస్ నిర్మాణ సంస్థ తమ రెండో ప్రాజెక్ట్ గా తీసుకు రాబోతున్న 'జర్నీ టు అయోధ్య' ప్రీ లుక్ అదిరిపోయింది.

Journey To Ayodhya movie pre look released
Journey To Ayodhya : ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లమంది హిందువుల ఎన్నో ఏళ్ళ కలని ఇటీవల అయోధ్య రామ మందిర ఓపెనింగ్ తో నిజం చేసుకున్నారు. నేడు శ్రీరామనవమి కావడంతో.. అయోధ్య రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ రామనవమిని పురస్కరించుకొని సినిమా పరిశ్రమ నుంచి కొత్త సినిమా అప్డేట్స్ వస్తున్నాయి. ఈక్రమంలోనే చిత్రాలయం స్టూడియోస్ నిర్మాణ సంస్థ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది.
ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో కలిసి గోపీచంద్, శ్రీనువైట్ల ‘విశ్వం’ సినిమాని తమ మొదటి ప్రాజెక్ట్ గా రూపొందిస్తోన్న చిత్రాలయం స్టూడియోస్.. రెండో సినిమాగా రాముడి కథని తీసుకు రాబోతున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కి ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య ఈ సినిమాకి కథని అందిస్తున్నారు.
Also read : Siddharth – Aditi Rao Hydari : సిద్దార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్.. మై మానికార్న్ అంటే ఏంటి..
వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఓ యంగ్ డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ చిత్రం.. లోకేషన్స్ రెక్కీ జరుపుకుంటుంది. ఈ సినిమాకి పని చేయబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామంటూ మేకర్స్ తెలియజేసారు. ఇక ఈ మూవీని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.