RRR: చరణ్ ప్రాక్టీస్ చేశావా.. తారక్ మార్క్ ప్రమోషన్ షురూ!

ఆర్ఆర్ఆర్ జెన్యూన్ అప్ డేట్స్ కోసం సినిమా పేరుతోనే ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. దీనికి సంబంధించి నిన్ననే అనౌన్సమెంట్ రాగా ఆగస్ట్ 9వ ఉదయం నుండి ఎన్టీఆర్ ఇందులో ప్రమోషన్ కూడా మొదలుపెట్టాడు.

RRR: చరణ్ ప్రాక్టీస్ చేశావా.. తారక్ మార్క్ ప్రమోషన్ షురూ!

Rrr

Updated On : August 9, 2021 / 12:49 PM IST

RRR: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌, మోస్ట్ అవెయిటెడ్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఉక్రెయిన్ లో చివరి దశలో ఉంది. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్‌, హీరోయిన్ ఒలీవియా మోరీస్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

అయితే దర్శకుడితో పాటు స్పెషల్ ప్రమోషన్ టీం తరచూ ఈ మూవీ నుంచి కొత్త అప్‌డేట్స్‌ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ జెన్యూన్ అప్ డేట్స్ కోసం సినిమా పేరుతోనే ఏర్పాటు చేసిన సోషల్ మీడియా ఖాతాలలో ఒకటైన ఆర్ఆర్ఆర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతా ఇప్పుడు ఎన్టీఆర్ చేతికి వచ్చింది. దీనికి సంబంధించి నిన్ననే అనౌన్సమెంట్ రాగా ఆగస్ట్ 9వ ఉదయం నుండి ఎన్టీఆర్ ఇందులో ప్రమోషన్ కూడా మొదలుపెట్టాడు.

ఎన్టీఆర్ చేతికి వచ్చాక తొలి వీడియోగా రామ్ చరణ్ కి సంబందించిన ఫన్ చాట్ పోస్ట్ చేశారు. చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయ్యిందా అంటూ ఎన్టీఆర్ అడగగా, రామ్ చరణ్ బల్లపై చేతులతో డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తాడు. ఈ వీడియో కాస్త ఫన్ గా ఉండటంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగానే ఆర్ఆర్ఆర్ నుండి ఏ కంటెంట్ వచ్చినా క్రేజీగా మారుతుండగా.. ఎన్టీఆర్ మార్క్ ప్రమోషన్ ఇప్పుడు మరికాస్త తోడవడంతో ప్రమోషన్ మరో రేంజ్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by RRR Movie (@rrrmovie)