Theatrical Releases : ఈ వారం థియేటర్స్ లో తెలుగులో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా థియేటర్లలో తెలుగులో మీడియం సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి.

July second week Telugu Theatrical Releasing Movies list
Theatrical Releases : సెకండ్ హాఫ్ మొదలయ్యాక కూడా చాలా వరకు చిన్న సినిమాలే వస్తున్నాయి. ప్రతివారం రిలీజయిన సినిమాల్లో ఏదో ఒకటి ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఈ వారం కూడా థియేటర్లలో తెలుగులో మీడియం సినిమాలే రిలీజ్ కాబోతున్నాయి.
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. SKN నిర్మాణంలో సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. పాటలు, ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ‘బేబీ’ సినిమా జులై 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.
ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ జంటగా వడివేలు ముఖ్య పాత్రలో తమిళ్ లో తెరకెక్కిన ‘మామన్నన్’ సినిమా అక్కడ రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో ‘నాయకుడు’ పేరుతో జులై 14న రిలీజ్ చేయనున్నారు.
శివ కార్తికేయన్, అదితి శంకర్ జంటగా తమిళ్ లో తెరకెక్కిన ‘మహావీరన్’ సినిమాని తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు చిత్రయూనిట్. ఈ సినిమా కూడా జులై 14 న విడుదల చేయనున్నారు.
హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ నటించిన ‘మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రికరింగ్ పార్ట్ 1’ సినిమా కూడా తెలుగులో డబ్బింగ్ అయి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాని జులై 12 నే విడుదల చేస్తున్నారు.
ప్రముఖ రచయిత దీనరాజ్ కొత్తవాళ్లతో ‘భారతీయన్స్’ అనే ఓ చిన్న సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ సినిమా జులై 14 న రిలీజ్ కానుంది.