విక్రమ్ న్యూ లుక్ : ‘కదరం కొండన్’ టీజర్ వైరల్

తమిళ హీరో చియాన్ విక్రమ్ మరో కొత్త చిత్రంతో ముందుకొస్తున్నాడు. రాజేశ్ ఎం శెల్వ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘కదరం కొండన్’. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

  • Published By: sreehari ,Published On : January 16, 2019 / 05:37 AM IST
విక్రమ్ న్యూ లుక్ : ‘కదరం కొండన్’ టీజర్ వైరల్

తమిళ హీరో చియాన్ విక్రమ్ మరో కొత్త చిత్రంతో ముందుకొస్తున్నాడు. రాజేశ్ ఎం శెల్వ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘కదరం కొండన్’. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

తమిళ హీరో చియాన్ విక్రమ్ మరో కొత్త చిత్రంతో ముందుకొస్తున్నాడు. రాజేశ్ ఎం శెల్వ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ నిర్మిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘కదరం కొండన్’. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కమల్ చిన్న కుమార్తె అక్షర హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. కదరం కొండన్ టీజర్ లో విక్రమ్ ఎంతో స్టయిలీస్ గా కనిపించాడు. 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని చిత్ర యూనిట్ కు విషెస్ చెబుతూ.. ఈ చిత్రం టీజర్ ను కమల్ హాసన్ ట్వీట్ చేశాడు. టీజర్ విడుదలైన క్షణాల్లోనే వైరల్ గా మారింది. విక్రమ్ న్యూ లుక్.. అభిమానులు సహా అందరిని ఆకట్టుకుంటోంది. ఘిబ్రాన్ కొండన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019 సమ్మర్ లో రిలీజ్ చేసేందుక సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో విడుదల కానున్న ఈ మూవీని చూసేందుకు విక్రమ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

‘కదరం కొండన్’ మూవీ టీజర్ ఇదే..