Kajal Aggarwal : నాగ్ సినిమా క్యాన్సిల్.. కాజల్ కన్ఫమ్ చేసేసిందా..?
కాజల్ అగర్వాల్.. నాగార్జున ‘ఘోస్ట్’ సినిమా నుంచి తప్పుకోవడానికి అసలు కారణం అదేనా..?

Kajal
Kajal Aggarwal: దాదాపు 10 ఏళ్లకు పైగా టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగింది కలువ కళ్ల చిన్నది కాజల్ అగర్వాల్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. పాండమిక్ టైంలో గతేడాది అక్టోబర్ 30న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Kajal Aggarwal : ఆ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా చేస్తా – కాజల్ కిచ్లు..
కొద్ది రోజులుగా కాజల్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాజల్ కిచ్లు ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, అందుకే చేతిలో ఉన్న సినిమాలు తప్ప కొత్తవి కమిట్ అవడంలేదని.. తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చెయ్యనుందంటూ న్యూస్‌తో పాటు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
Kajal Aggarwal : ‘వాటర్ బేబి’ కాజల్ అగర్వాల్..
కట్ చేస్తే ఆ వార్తలు నిజమే అన్నట్లుంది కాజల్ వ్యవహారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్న ‘ఆచార్య’ పూర్తి చేసిన కాజల్.. నాగార్జున పక్కన ప్రవీణ్ సత్తారు ‘ఘోస్ట్’ మూవీ చేస్తుంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి తప్పుకుంది కాజల్,. ఆమె ప్లేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను తీసుకున్నారు మేకర్స్. అయితే కాజల్ గర్భవతిగా ఉన్నందుకే ఈ సినిమా చెయ్యట్లేదని తెలుస్తోంది. ఏదమైనా కాజల్ రియాక్ట్ అయితే కానీ ఈ వార్తలకు శుభం కార్డ్ పడదు.
Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?