Kajal Aggarwal : ఆ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా చేస్తా – కాజల్ కిచ్లు..

కాజల్ అగర్వాల్.. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ.. తక్కువ టైంలో 50 సినిమాలు కంప్లీట్ చేసింది..

Kajal Aggarwal : ఆ విషయంలో ఆయన ఎలా చెప్తే అలా చేస్తా – కాజల్ కిచ్లు..

Kajal Aggarwal

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌తో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ.. తక్కువ టైంలో 50 సినిమాలు కంప్లీట్ చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. తెలుగులో ఫస్ట్ సినిమా (లక్ష్మీకళ్యాణం), 50వ సినిమా (ఎమ్ఎల్ఎ) నందమూరి కళ్యాణ్ రామ్‌తోనే చెయ్యడం విశేషం.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ లో చిరుకి జోడీగా నటిస్తోంది. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత కాజల్, మెగాస్టార్‌తో చేస్తున్న రెండో సినిమా ఇది.

Kajal – Gautam Kitchlu : చిరు ఆశీస్సులందుకున్న కాజల్, గౌతమ్..

కెరీర్ మంచి స్వింగ్‌లో ఉండగానే.. గతేడాది ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది కాజల్. రీసెంట్‌గా భర్త, సిస్టర్ నిషా అగర్వాల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పెళ్లి తర్వాత ఫస్ట్ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది.

ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్‌లో చాలా ఛేంజెస్ వస్తాయ్. ముఖ్యంగా హీరోయిన్ల కెరీర్ ఆల్‌మోస్ట్ ఎండ్ అయినట్టే. ఫ్యామిలీతో స్పెండ్ చెయ్యడానికే టైం సరిపోదు. పెళ్లి తర్వాత కెరీర్ కంటిన్యూ చెయ్యడం అంటే అంత ఈజీ కాదు.

Kajal Aggarwal : హ్యాపీ బర్త్‌డే కాజల్ అగర్వాల్..

సమంత, అనుష్క శర్మలా ఎవరో ఒకరు అరుదుగా, సెలక్డెడ్‌గా మూవీస్ చేస్తూ.. తమ హవా కొనసాగిస్తుంటారు. ‘ఇటీవలే పెళ్లి చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేశారు కదా.. మరి ఇంతకుముందులానే సినిమాలు చేస్తారా.. మానేస్తారా..? అని అడిగితే ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది కాజల్..

పెళ్లి తర్వాత హస్బెండ్ గౌతమ్ ఇంటీరియర్ బిజినెస్‌కు తనవంతుగా ప్రమోషన్స్ కూడా చేస్తోంది కాజల్. ‘నేను సినిమాల మీద కాన్సన్‌ట్రేట్ చెయ్యడానికి నా భర్త, ఇంకా ఫ్యామిలీ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది.. కానీ ఎంతకాలం నటిస్తానో తెలియదు.. నా భర్త గౌతమ్ వద్దు అని చెప్పినప్పుడు సినిమాలు చెయ్యడం మానేస్తాను’ అని చెప్పుకొచ్చింది కాజల్ కిచ్లు.

Kajal Aggarwal : కాక రేపుతున్న కాజల్ అగర్వాల్..