Kajal Aggarwal : మొద‌టిసారి తెలుగులో మాట్లాడిన టాలీవుడ్ చంద‌మామ‌..

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Kajal Aggarwal : మొద‌టిసారి తెలుగులో మాట్లాడిన టాలీవుడ్ చంద‌మామ‌..

Kajal Aggarwal First time talk in Telugu at satyabhama trailer launch event

Kajal Aggarwal Telugu : టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో కెరీర్ ను ఆరంభించిన అమ్మ‌డు చంద‌మామ చిత్రంతో టాలీవుడ్ చంద‌మామ గుర్తింపు తెచ్చుకుంది. ఇక రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన మ‌గ‌ధీర సినిమాతో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా సెటిలైంది.

17 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో అగ్ర‌హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు క‌లిసి న‌టించింది. అయిన‌ప్ప‌టికీ ఎన్న‌డూ కూడా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఏ సినీ ఈవెంట్‌లో కూడా తెలుగులో మాట్లాడ‌లేదు. అయితే.. ఈ ముద్దుగుమ్మ మొద‌టి సారి తెలుగులో మాట్లాడింది. అది కూడా నంద‌మూరి అంద‌గాడు బాల‌య్య కోసం.

కాజల్ మెయిన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన లేడి ఓరియంటెడ్ చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమా జూన్ 7 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో ఈ చిత్ర ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్య అతిథిగా బాల‌య్య హాజ‌రై ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. ఈ ఈవెంట్‌లో కాజ‌ల్ తొలిసారి తెలుగులో మాట్లాడుతున్నాను. కాస్త అర్థం చేసుకోండి అంటూ బాల‌య్య గురించి చెప్పుకొచ్చింది.

Meiyazhagan : ’96’ మూవీ ఫేమ్ ద‌ర్శ‌కుడితో కార్తీ.. సినిమా పేరేంటో తెలుసా..? ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌

‘బాల సార్ దగ్గర లెక్కలు ఉండవు. కేవలం ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఆయన లాంటి మంచి మంచోడిని నేను ఎప్ప‌డూ చూడ‌లేదు. బాల సార్ డిక్షన్ కి నేను పెద్ద అభిమానిని. ఆయన ఎనర్జీ ఎవరితో పోల్చ‌లేం. ఆయ‌న ప్రేమ స్వచ్ఛమైనది. ఆయన మొత్తానికి అన్‌స్టాపబుల్.’ అంటూ కాజ‌ల్ మాట్లాడింది. కాజ‌ల్ తెలుగులో మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

ఇక స‌త్య‌భామ సినిమా విష‌యానికి వ‌స్తే.. సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో కాజ‌ల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తోంది. నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.